యాపిల్ ఐఫోన్ లో.. 'ఐ' అంటే అర్థమేంటో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో మొబైల్ కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు ఎంతలా ప్రయత్నాలు చేస్తున్నాయో ప్రత్యేకంగా చంపాల్సిన పనిలేదు. ఏకంగా అతను టెక్నాలజీతో కూడిన ఫీచర్లను తీసుకువచ్చి.. ఇక తమ మార్కెట్ నూ పెంచుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాయ్. ఇక ప్రస్తుతం ఎన్నో రకాల బ్రాండ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఎన్ని రకాల మొబైల్స్ అందుబాటులోకి వచ్చిన అటు యాపిల్ కంపెనీ తయారుచేసే ఐఫోన్ కు ఉండే క్రేజ్ మాత్రం ఇప్పటివరకు తగ్గలేదు అని చెప్పాలి.

మిగతా కంపెనీలు విడుదల చేసే మొబైల్ తో పోల్చి చూస్తే అటు ఐఫోన్ ధర ఆకాశాన్ని అంటుతూ ఉంటుంది. అయినప్పటికీ ఇక ఈ మొబైల్ ని కొనుగోలు చేయాలని ఎంతో మంది ఇష్టపడుతూ ఉంటారు. ఐఫోన్ తమ దగ్గర ఉంటే అది ఒక స్టేటస్ అన్నట్లుగా భావిస్తూ ఉంటారు చాలామంది. అదే సమయంలో ఇక ఈ ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్స్, కెమెరా ఇవన్నీ మిగతా ఫోన్లతో పోల్చి చూస్తే అద్భుతంగా ఉంటాయి. అందుకే ఇక ఈ మొబైల్ ను వాడేందుకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక ధనవంతులు అయితే ఐఫోన్ లో టాప్ ఫీచర్స్ ఉన్న మొబైల్స్ ని కొనుగోలు చేస్తూ ఉంటారు అని చెప్పాలి.

 అయితే ఐ ఫోన్లో ఐ అంటే ఏమిటి అంటే ఇక ఎంతో మంది  చిత్ర విచిత్రమైన డెఫినిషన్స్ ఇస్తూ ఉంటారు. కొంతమంది ఐ అంటే నా ఫోన్ అని అర్థం వస్తుందని మరి కొంతమంది ఐ అంటే ఇండియన్ అని ఇలా తమకు నచ్చిన విధంగా వివరణ ఇస్తూ ఉంటారు. కానీ ఐ ఫోన్లో ఐ అనే పదానికి వేరే అర్థం ఉందట. అయితే కంపెనీ దీనిపై ఖచ్చితమైన అర్ధాలు  చెప్పకపోయినప్పటికీ ఐ అనేది ఐదు పదాలను సూచిస్తుందని 1998లో స్టీవ్ జాబ్స్ పేర్కొన్నారు. ఐఫోన్లు ఐ అంటే ఇంటర్నెట్, ఇండివిజువల్, ఇన్ స్ట్రక్ట్, ఇన్ ఫార్మ్, ఇన్ స్పయిర్ అనే పదాలను సూచిస్తుంది అని ఆయన చెప్పారు. అయితే దీనికి టెక్నికల్ గా మాత్రం ఎలాంటి అఫీషియల్ మీనింగ్ లేదు అని స్టీవ్ జాబ్స్ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: