బుల్లి పిట్ట: OTT ప్రియులకు గుడ్ న్యూస్.. ప్రైమ్ ప్లాన్ భారీ తగ్గింపు..!!

Divya
కరోనా సమయం నుంచి ఎక్కువగా సినిమాలను ఓటీటి లోనే చూస్తూ ఉన్నారు ప్రేక్షకులు. థియేటర్లో విడుదలైన ఎలాంటి చిత్రమైన సరే 40 రోజులలోపే ఏదో ఒక ఓటీటి లలో వస్తూనే ఉంది. దీంతో పలు రకాల ఓటీటి సంస్థలకు సైతం మంచి లాభాలను తెచ్చిపెట్టే విధంగా చేస్తున్నాయి చిత్రాలు. దీంతో గత కొద్ది రోజుల క్రితం పలు రకాల ఓటిటి సంస్థలు భారీగా ధరలను పెంచడంతో ఒక్కసారిగా వీటి హవా కూడా ఈ మధ్య తగ్గిపోయింది ఇలాంటి వాటిని తెలుసుకున్న అమెజాన్ ప్రైమ్ తాజాగా లైట్ మెంబర్షిప్ ధరను తగ్గించింది.

999 గా ఉన్న అమెజాన్ ప్రైమ్ సపోర్ట్ మెంబర్షిప్ ను  ఇప్పుడు దీనిని 799కే అది కూడా ఏడాది వరకు.. తీసుకురావడం జరిగింది.. మిగిలినవి గతంలో మాదిరిగానే మెంబర్షిప్ 299 నెలకు..599 మూడు నెలలకు.. ఏడాది ప్లాన్ ప్రకారం 1499 ఉన్నది.ఆ తర్వాత ప్రైమ్ లైటును జూన్లో ప్రారంభించింది. ఆమెజాన్ ఇందులో పలు రకాల మార్పులను కూడా చేసి ప్రకటించడం జరిగింది. అయితే ఇతర ప్రైమ్ మెంబర్షిప్పులతో పోలిస్తే ఇందులో కాస్త ప్రయోజనాలు తక్కువగానే ఉంటాయట.
ఈ కామర్స్ ప్లాట్ఫారం మెంబర్షిప్ ధరలు 200 రూపాయల వరకు తగ్గించినట్లు తెలియజేసింది.. మిగిలిన వాటిలో ఎటువంటి తగ్గింపు లేదని కూడా తెలిపారు.. సాధారణ ప్రైమ్ మెంబర్షిప్ ఉన్నవాళ్లు పలు రకాల ప్రయోజనాలను సైతం పొందవచ్చు.. ఈ ప్లాన్లు ఇంతకుముందు రెండు రోజులలోనే డెలివరీ చేసేవారు.. అయితే ప్రస్తుతం ఉన్న వాటి వల్ల ఇంకాస్త ఫాస్ట్ గా డెలివరీ చేసేందుకు అవకాశం ఉందట.. ప్రైమ్ వీడియో క్వాలిటీ HD 720 కి పరిమితం చేశారు. తాజా తగ్గింపు వల్ల ఈ మెంబర్షిప్ కేవలం ఒక యూజర్ కి మాత్రమే సపోర్టు చేస్తుందట.. ఏదైనా వస్తువు కొంటే దానిపైన 175 తో మార్నింగ్ కె డెలివరీ.. నో కాస్ట్ EMI, ఫ్రీ డెలివరీ వంటి సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: