
అంతరిక్షంలో ఓ వస్తువును వదిలివస్తే ఏమవుతుంది?
ఈ సమయంలో వారు అంతరిక్ష కేంద్రం హ్యాండిలింగ్ బార్ ను తొలగించి దానితో బేరింగ్ ని రిప్లేస్ చేశారు. అనంతరం వారు తిరిగి స్పేస్ స్టేషన్ కి వచ్చేశారు. కొద్ది సేపటికి వారు ఏదో వస్తువును అంతరిక్షంలోని మరచిపోయినట్లు గుర్తించారు. ఆ తర్వాత అది టూల్ బ్యాగ్ అని తేలింది. ఈ ఘటనపై నాసా స్పందిస్తూ..మా కార్యకలాపాల్లో టూల్ బ్యాగ్ పోగోట్టుకున్నాం అని పేర్కొంది.
ఈ బ్యాగ్ అన్నీ స్పేస్ వాక్ లకు అవసరం లేదని వెల్లడించింది. ఈ బ్యాగ్ అంతరిక్ష కేంద్రాన్ని ఢీకొనే ముప్పు అతి స్వల్పంగా ఉందని మిషన్ కంట్రోల్ వెల్లడించినట్లు వివరించింది. ప్రస్తుతం ఈ బ్యాగ్ భూమికి 250మైళ్ల ఎత్తున అంతరిక్షంలో తిరుగుతోంది. ఈ ఘటనపై అంతరిక్షంలో కార్యకలాపాలను గమనించే ఎర్త్ స్కై అనే వెబ్ సైట్ స్పందించింది.
ఆ కాంతివంతమైన టూల్ బ్యాగ్ అంతరిక్షంలో కొన్ని నెలల పాటు తిరిగి ఆపై మెల్లగా విచ్ఛిన్నమవుతుందని పేర్కొంది. ఆ బ్యాగ్ లో ఎటువంటి టూల్స్ ఉన్నాయన్న విషయాన్ని నాసా బహిర్గతం చేయలేదు. ఐఎస్ఎస్ లో టూల్ బ్యాగ్ పోగోట్టుకున్న ఘటన ఇదే మొదటిది కాదు. 2008లోను వ్యోమగాములు స్పేస్ వాక్ కు వెళ్లిన సమయంలో టూల్ బ్యాగ్ ను పోగోట్టుకున్నారు. టూల్ బ్యాగులతో పాటు పాత కృత్రిమ ఉపగ్రహాల శకలాలు వేలాదిగా అంతరిక్షంలో తిరుగుతున్నాయి. ఇవి ప్రస్తుతం అంతరిక్షంలో సెప్టెంబరు నాటికి దాదాపు 35వేలకు పైగా వ్యర్థాలు ఉన్నాయని ఐరోపా స్పేస్ సంస్థ వెల్లడించింది.