బుల్లి పిట్ట: ఇక మీదట వాట్సప్ బ్యాకప్ చేసుకోవడం కష్టమే..!!

Divya
వాట్సాప్ నుంచి ప్రతి ఒక్కరు కూడా వాయిస్ కాలింగ్ చాట్ వంటివి చేస్తూ ఉంటారు.. అయితే ఏదైనా సందర్భాలలో మనం వీటిని రీస్టార్ట్ చేసినప్పుడు వాట్సప్ బ్యాకప్ అనేది అడుగుతూ ఉండేది.. కానీ ఇక మీదట ఇలాంటి బ్యాకప్ చేయడం చాలా కష్టంగా మారుతుంది. ఎందుకంటే ఇక మీదట వీటికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుందట. గతంలో 5 జిబి వాట్సాప్ బ్యాక్అప్ ఫ్రీగా చేసుకోవచ్చు. మరి కొద్ది రోజులలో గూగుల్ ప్రీమియం కూడా చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.
ఆండ్రాయిడ్ వినియోగదారులకు గూగుల్ 15 Gb వరకు ఉచితంగా బ్యాకప్ చేసుకుని సదుపాయాన్ని అందిస్తోంది.. ఇదే కాకుండా వాట్సప్ చాట్ బ్యాక్అప్  కూడా 5 జిబి వరకు అదనంగా ఇస్తున్నది. అయితే ఇప్పుడు మొత్తం వాట్సాప్ బ్యాకప్ తో కలుపుకొని  15Gb డేటాను సైతం గూగుల్ డ్రైవ్ లో స్టోర్ చేసుకునే విధంగా అవకాశాన్ని కల్పిస్తున్నది. అంతకంటే ఎక్కువ చాట్ బ్యాక్అప్ అయితే కచ్చితంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుందట.. ప్రస్తుతం బీటా వర్షన్ లో ఇలాంటి ప్రీమియం చెల్లింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా..15 Gb దాటిపోతే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని తెలుపుతోంది.

గూగుల్ డ్రైవ్ లో ఒక్క అకౌంట్ కి 15 జిబి స్టోరేజ్ ను ఉచితంగా ఉంటుందట. ఈ స్టోరేజ్ లోని జిమెయిల్ గూగుల్ ఫోటోలు ఇతరత్రా బ్యాకప్ వంటివి చేసుకోవాలి.. గూగుల్ వన్ సభ్యత్వాన్ని తీసుకునేందుకు నెలకు 130 నుంచి ఏడాదికి 1300 చెల్లించాల్సి ఉంటుందట.. దీనివల్ల గూగుల్ 100 Gb క్లౌడ్ స్టోరేజ్ని సైతం అందిస్తుంది. ప్రస్తుతం వరుసగా పలు రకాల అప్డేట్లతో యూజర్స్ కి సైతం సరికొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది.. ముఖ్యంగా గ్రూప్ కాల్స్ కోసం ప్రత్యేకమైన వాయిస్ చాటున కూడా అందిస్తున్నది. ఇవే కాకుండా పలు రకాల ఫీచర్స్ సైతం వాట్సాప్ అందిస్తూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: