సైబర్ యుద్ధంగా.. ఇజ్రాయిల్-హమాస్ వార్?
ఇంటర్నెట్ ఆధారిత యుద్దం. ఇప్పుడు ప్రతి ఒక్క దేశం ఇంటర్నెట్ వినియోగంలో దూసుకుపోతుంది. ఇజ్రాయిల్ లో అక్టోబర్ 7 న జరిగిన నరమేధంలో పాలస్తీనాకు సంబంధించిన, లెబనాన్ కు సంబంధించిన వెబ్ సైట్లను కొంతమంది హ్యక్ చేశారు. అయితే ఈ హ్యకింగ్ వెనక ఇండియా ఉందని ఆయా దేశాలకు చెందిన వారు ఆరోపిస్తున్నారు. ఇజ్రాయిల్ ఇండియాకు మిత్ర దేశం కాబట్టి వార్ లో వారికి సాయపడేందుకు ఇలా ఇంటర్నెట్ ను హ్యాక్ చేశారని విమర్శలు చేస్తున్నారు.
ఇజ్రాయిల్ కు సంబంధించిన సైట్స్ ను పాలస్తీనాకు చెందిన వారు హ్యక్ చేశారు. ఇలా అత్యంత పటిష్టమైన ఇజ్రాయిల్ షిన్ బెట్, మోసద్ లాంటి ఇంటిలిజెన్స్ కు చిక్కకుండా దాడి చేయడంలో సక్సెస్ అయినట్లు చెప్పుకుంటున్నారు. ఇజ్రాయిల్ ఇంటర్నెట్ ను సక్సెస్ ఫుల్ గా హ్యక్ చేయగలిగామని చెబుతున్నారు.
అయితే ప్రపంచంలో ఇప్పటి వరకు త్రివిధ దళాల రూపంలో నే యుద్దం జరిగేది. ఇఫ్పుడు సైబర్ వార్ తో నాలుగో రకం యుద్ధం మొదలైందనే చెప్పొచ్చు. శత్రు దేశాల్లోని వివిధ రకాల ఇంటర్నెట్ వ్యవస్థలను కుప్పకూల్చడం ద్వారా తాము అనుకున్న లక్ష్యాలను నెరవేర్చవచ్చని అనుకున్నారు. ఇలా చేయడం వల్ల ఆయా దేశాల్లో ఉన్న వివిధ వ్యవస్థలపై దాని ప్రభావం పడుతుంది. అప్పుడు దాడులు చేయాలనుకున్న ప్రదేశాలను ఈజీగా రీచ్ కావొచ్చనే ప్రణాళికలను పాలస్తీనా ఇజ్రాయిల్ పై దాడి విషయంలో చేసి చూపించింది.