ఆ కంపెనీతో చైనా.. దేశాలను గుప్పిట్లో పెట్టుకుంటోందా?

చైనాకు సంబంధించి సెమీ కండక్టర్ చిప్ లు తయారు చేసే సంస్థ హువాయ్. అయితే ఈ హువాయ్ సంస్థను అడ్డు పెట్టుకుని చైనా వివిధ దేశాల్లో అత్యంత కీలక సమాచారాలను దొంగలిస్తున్నట్లు తెలిసింది. దీంతో హువాయ్ తయారు చేసే సెమీ కండక్టర్ చిప్ లపై వివిధ దేశాలు నిషేధం విధించాయి. ఇప్పుడు అమెరికా చైనా చేస్తున్న గూడచార్యం గురించి తెలుసుకుని ఆ సంస్థపై నిషేధం విధించింది.

అయితే అంతకుముందే మేల్కొన్నఇండియా చైనా కుయుక్తలను పసిగడ్డి టిక్ టాక్ ను బ్యాన్ చేసింది. తద్వారా టిక్ టాక్ సంస్థ ఆదాయాన్ని దెబ్బతీయడమే కాకుండా చైనాకు ఆర్థికంగా ఇండియా ద్వారా లాభం పొందుతున్న వైనాన్నిఅడ్డుకుంది. అయితే టిక్ టాక్ బ్యాన్ తర్వాత మరిన్ని సంచలన విషయాలు భారత్ బయటపెట్టింది. చైనా ప్రతి విషయంలో కూడా మోసం చేస్తోందని అన్ని దేశాలపై నిఘా పెడుతోందని భారత్ బహిర్గతపరిచింది.

ఇప్పుడు హువాయ్ సంస్థకు సంబంధించిన సెమీ కండక్టర్ చిప్స్ ను ఎవరూ కొనడం లేదు. దీంతో ప్రపంచ దేశాల్లో ఎవరైతే సెమీ కండక్టర్ చిప్స్ తయారు చేస్తున్నారో వారితో కలిసి పని చేసేందుకు ప్లాన్ చేస్తోంది. పెట్టుబడులు మేం పెడతాం. మీతో కలిసి వ్యాపారం చేస్తామంటూ ముందుకు వస్తుంది. అయితే ఈ సెమీ కండక్టర్ చిప్స్ వల్ల చాలా భయంకరమైన ప్రమాదాలు ఉన్నాయి.

చైనా తయారు చేస్తున్న సెమీ కండక్టర్ చిప్ లు అన్ని దేశాల మధ్య సంబంధాలు బాగానే ఉన్న వరకు ఓకే. ఒక వేళ చైనాతో వైరం కలిగి యుద్ధం చేయాల్సి వస్తే ఆయా దేశాల్లో ఉన్న యుద్ధ విమానాలు, వాహనాలు రక్షణ ఆయుధాలు ఏవీ పని చేయకుండా చైనా తన చేతుల్లోకి తీసుకుంటుంది. అంటే ఈ సెమీ కండక్టర్ల ద్వారా తీసుకున్న సమాచారంతో అవి నడవకుండా చేయగల శక్తిని చైనా సంపాదించుకుంటుంది. కాబట్టి చైనా కుయుక్తులను ఒక్కొక్క దేశం ఇప్పుడే తెలుసుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: