
సాఫ్ట్‌వేర్ ప్రోత్సాహానికి మోదీ కీలక నిర్ణయం?
మహా ఉంటే భారత్ లో స్కిల్డ్ లేబర్స్ ఒక 5 నుండి 6 శాతం మంది మాత్రమే ఉంటారని, అదే చైనాలో అయితే 26 నుండి 30 శాతం వరకు స్కిల్డ్ లేబర్స్ ఉంటారని గొప్పలు చెప్పుకుంటూ, బడాయి పోతుంది. చైనాలో చదువులు పూర్తయిన తర్వాత విద్యార్థులందరూ సాఫ్ట్ వేర్ రంగంలోకి దూసుకుపోతారని అంటుంది అది. కానీ భారత్ అంత అప్డేట్ అవ్వలేదంటూ చెప్పుకొస్తుంది చైనా. స్కిల్డ్ లేబర్స్ విషయంలో భారత్ చైనాని అందుకోలేదని సవాళ్లు విసురుతుంది.
చైనా ఎప్పుడూ పాకిస్తాన్ లాగానే భారత్ పై ఈర్షతో బ్రతుకుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ దేశాలు భారత్ ను చూసి భయపడుతూ ఉంటాయి. చైనా అయితే భారత్ తమకన్నా ఉన్నతమైన స్థానంలోకి చేరుకుంటుందేమోనని భయపడుతూ ఉంటుంది. పాకిస్తాన్ అయితే తనను ఎప్పుడో దాటేసిన భారత్ ను చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది. నిజం చెప్పాలంటే మన భారతదేశం నుండి వివిధ దేశాలకు వెళ్లి ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.
సుమారు 193 దేశాలలో మన భారతీయులు సాఫ్ట్ వేర్ రంగ నిపుణులుగా రాణిస్తున్నారు. కానీ ఇక్కడ స్కిల్స్ తక్కువగా నేర్చుకున్న వాళ్ళు సాఫ్ట్ వేర్ సంస్థల్లో చిన్న చిన్న జాబులు చేసుకుంటున్నారు. కానీ తమ సాంకేతిక ప్రతిభ పెంచుకున్న వాళ్ళు మాత్రం ఉన్నత స్థానాల్లో ఉంటున్నారు. అయితే స్కిల్ డెవలప్మెంట్ కోసం కేంద్రం శిక్షణ తరగతులు నిర్వహిస్తుంటే వాటిని కూడా పక్కదోవ పట్టించి కొంతమంది డబ్బులు దండుకుంటున్నారని తెలుస్తుంది.