వాట్సాప్‌లో ఇండిపెండెన్స్ డే స్టిక్కర్స్ ఇలా డౌన్‌లోడ్ చేయండి?
మరి కొద్ది రోజుల్లోనే ఇండియా మొత్తం స్వాతంత్ర్య దినోత్సవం సెలబ్రేట్ చేసుకోనుంది కదా. దీంతో వాట్సాప్‌లో ఇతరులకు విషెస్ చెప్పడానికి యూజర్లు ఇండిపెండెన్స్ డే స్టిక్టర్స్ డౌన్‌లోడ్ చేసుకోవలసిన అవసరం ఆసన్నమైంది. ఆగస్టు 15 నాడు దేశం మొత్తం 76వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలకు సిద్ధమవుతోంది. ఇంకెందుకాలస్యం... మీరు, మీ కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, స్నేహితులకు వాట్సాప్ స్టిక్కర్స్ ద్వారా స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేయండి మరి.
దానికోసం ముందుగా స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇష్టమైన స్టిక్కర్ అప్లికేషన్ కోసం వెతకండి. చాలా థర్డ్-పార్టీ స్టిక్కర్ యాప్‌లు అందుబాటులో ఉంటాయి. ఆ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, స్వాతంత్ర్య దినోత్సవ స్టిక్కర్ ప్యాక్‌లకు సంబంధించిన సెక్షన్ కోసం వెతకండి. తరువాత స్వాతంత్ర్య దినోత్సవ స్టిక్కర్ ప్యాక్‌లలో దేనిపై అయినా క్లిక్ చేసి, మంచి స్టిక్కర్ల కోసం వెతకండి. ప్రతి ప్యాక్‌లో భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల స్ఫూర్తిని తెలియజేసేలా స్టిక్కర్స్ మీకు కనిపిస్తాయి. మీకు నచ్చిన స్టిక్కర్ ప్యాక్‌ను కనబడిన తర్వాత, మెయిన్ స్క్రీన్‌లో ప్యాక్ పక్కన ఉన్న 'యాడ్ టూ వాట్సాప్' లేదా 'యాడ్' బటన్‌పై ట్యాప్ చేయండి. అపుడు వాట్సాప్‌తో స్టిక్కర్ ప్యాక్‌ను ఇంటిగ్రేట్ చేయమని యాప్ అడగగానే దానిపై క్లిక్ చేసి, మరోసారి 'యాడ్' బటన్‌ను క్లిక్ చేయండి. అంతే ఇక ఎంచుకున్న స్టిక్కర్ ప్యాక్ వాట్సాప్ స్టిక్కర్ సెక్షన్‌కి యాడ్ అవుతుంది.