ఆ రంగంలో ఇక భారత్‌ దూసుకుపోతుందా?

సెమీ కండక్టర్ చిప్స్ ఈమాట ఇప్పుడు భారతదేశానికి లక్షల కోట్ల పెట్టుబడిని తీసుకువచ్చే ఒక మంత్రం. నరేంద్ర మోడీ మొన్న అమెరికా టూర్ కి వెళ్ళిన ప్రత్యేక సందర్భాలలో ఇది కూడా ఒకటి అని తెలుస్తుంది. ఇప్పటివరకు పక్క దేశాల్లోనే ఉండే సెమీ కండక్టర్ చిప్స్ రంగం ఇప్పుడు భారతదేశంలోకి కూడా రాబోతుందని తెలుస్తుంది. ఈ సెమి కండక్టర్ చిప్స్ రంగం తరపున భారత దేశానికి 25  బిలియన్ డాలర్ల  పెట్టుబడులు రావచ్చు అని ఒక అంచనా ఉంది.

పిఎల్ఐ విభాగం కింద ఈ పథకానికి 76 వేల కోట్లు అంటే దాదాపుగా పది బిలియన్ డాలర్లు, ఇటీవలే ప్రకటించబడిందని తెలుస్తుంది. భారత దేశంలో సెమీ కండక్టర్ ఇంకా డిస్ప్లే తయారీ ఎలక్ట్రానిక్స్ ఎకో సిస్టం కోసం ఈ ఖర్చు చేయబడుతుందని తెలుస్తుంది. కొత్త ఇంజనీరింగ్ సెంటర్ కోసం యూఎస్ సెమి కండక్టర్ కంపెనీ అప్లైడ్ మెటీరియల్స్ భారతదేశంలో 400 కోట్ల మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టబోతుంది.

టిఎస్ఎంసి, పిఎస్ఎంసి, రెమిసాస్ ఎలక్ట్రానిక్స్, ఇంటెల్, ఏఎండి లాంటి ఇతర చిప్ దిగ్గజాలు కూడా భారతదేశంలో తమ తమ ఫ్యాక్టరీలను స్థాపించుకోవడానికి ఉవ్విళ్ళూరుతూ ఉన్నాయి. తైవాన్ కంపెనీ భారత దేశంలో తన టిఎస్ఎంఎస్సి  చిప్ ఫ్యాబ్రికేటెడ్ కంపెనీని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తుంది. దాని కోసం కర్మాగారాలను ఇక్కడ ఏర్పాటు చేయడానికి గల సాధ్యత గురించి వివిధ ఏజెన్సీలతో మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుంది.

టిఎస్ఎంఎస్సి బెంగళూరులో, ఇంకా కర్ణాటకలో అతి పెద్ద కార్యాలయాలను కలిగి ఉంది. అది ఆసియా, యూరప్, ఇంకా ఉత్తర అమెరికాలలో ఉన్న తన వినియోగదారులకు మద్దతును ఇస్తూ డిజైన్ డెవలప్మెంట్లలో భారత దేశం లోని కంపెనీలకు మద్దతునిస్తూ ప్రోత్సహిస్తుంది. ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్స్ అసోసియేషన్ ఇంకా కౌంటర్ పాయింట్ రీసెర్చ్ చేసిన దాని ప్రకారం భారత్ యొక్క సెమీ కండక్టర్ కాంపోనెంట్ వ్యాపారం 300 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: