అమెరికా, సౌదీ మధ్య కొత్త లడాయి?

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్  సౌదీ అరేబియాకు ఆ మధ్య వెళ్లారు. తర్వాత అమెరికా అధ్యక్షుడు సౌదీ అరేబియా ప్రిన్స్ ను అరెస్టు చేస్తామని చెప్పడంతో ఆయా గల్ప్ దేశాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా సౌదీ అమెరికాకు సరఫరా చేసే ఆయిల్ ను ఎక్కువ రేటుకు అమ్మడం, చైనా, రష్యాలతో సౌదీ దోస్తీ కట్టడం, అమెరికాను కాదనడంతో అగ్రరాజ్యం ఆత్మరక్షణలో పడిపోయింది. కానీ ఓపెక్ కంట్రీలు అంటేనే అమెరికా ఎలా చెబితే అలా వినేవి. కానీ కాలం మారింది.


ప్రస్తుతం సౌదీ అరేబియా సరికొత్త ప్లాన్ వేసింది. డొమెస్టిక్ న్యూక్లియర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని అమెరికాపై ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. దీనికి అమెరికా ఒప్పుకోలేదని అందువల్లే సౌదీ అమెరికాపై ఆగ్రహంగా ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా న్యూక్లియర్ ప్లాంట్ ఏర్పాటు చేసి పవర్ ను ఎక్కువగా ఉత్పత్తి చేసుకుంటామని చెబుతున్నా.. సౌదీ చుట్టు పక్కలా దేశాలతో వైరం ఉంది.


న్యూక్లియర్ ప్లాంటుకు అనుమతి ఇచ్చినా దానికి సై అన్న రాబోయే రోజుల్లో సౌదీ, ఇరాన్, సౌదీ లెబనాన్ , లాంటి దేశాల మధ్య తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితులు తప్పవని చెబుతున్నారు. ముఖ్యంగా సౌదీ గల్ప్ దేశాల్లో పెద్దన్న పాత్ర పోషిస్తుంది. ఇలాంటి దేశానికి అణ్వస్త్రాలు తయారు చేసుకునే శక్తి వస్తే మిగతా దేశాల పరిస్థితి ఏమిటి? అందుకే అమెరికా ఇన్ని రోజులు ఎలాంటి న్యూక్లియర్ ప్లాంట్ తయారీకి ఒప్పుకోలేదు.


చైనా, రష్యాలను ఇదే విషయంలో సౌదీ అడుగుతోంది. మీరు వచ్చి మా దేశంలో డొమెస్టిక్ న్యూక్లియర్ ప్లాంట్ పెట్టినా సరే లేక మాకు సహకరించినా ఒకే అంటోంది. తద్వారా పవర్ ఎక్కువ ఉత్పత్తిచేసి దాని ద్వారా ఆయిల్ ను ఎక్కువ ఉత్పత్తి చేసుకుని ప్రపంచంలోని నలుమూలలకు ఆయిల్ ను తాము అనుకున్న ధరకు సప్లై చేయాలని భావిస్తోంది. న్యూక్లియర్ ప్లాంట్ విషయంలో మాత్రం అమెరికా ససేమిరా అన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

USA

సంబంధిత వార్తలు: