బుల్లి పిట్ట: మూడు సరికొత్త టెక్నో మొబైల్స్ లాంచ్..!!

Divya
స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరికి నిత్యవసరం గా మారిపోయిన ఒక గ్యాడ్జెట్ అని చెప్పవచ్చు. కస్టమర్లను బాగా ఆకర్షించేందుకు పలు రకాల బ్రాండెడ్ మొబైల్స్ వారికి అవసరాలకు అనుగుణంగా పలు రకాల సరికొత్త ఫీచర్స్ కలిగిన మొబైల్స్ ను విడుదల చేస్తూ ఉన్నాయి. అలా ఇప్పుడు తాజాగా ప్రముఖ కంపెనీ ఆయన టెక్నో కంపెనీ ఏకంగా మూడు స్మార్ట్ మొబైల్స్ లను ఒకేసారి విడుదల చేయడం జరుగుతోంది .వాటి గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.

Tecno -keyan -20
ఈ స్మార్ట్ మొబైల్ 8gb ర్యామ్ తో 256 జీవి స్టోరేజ్తో లభిస్తుంది దీని ధర రూ.14,999 రూపాయలకు ఉన్నది ఈ మొబైల్ నిన్నటి రోజున ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ లో కొనుగోలు చేసుకోవచ్చు. ఈ మొబైల్ మూడు కలర్ల ఆప్షన్లు లభిస్తుంది..6.67 అంగుళాల హెచ్డి డిస్ప్లే తో పాటు ..64 mp బ్యాక్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా కలదు..5000 MAH సామర్థ్యంతో కూడిన బ్యాటరీ తో పాటు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
2).TECNO-KEYAN PRO -5G
ఈ స్మార్ట్ మొబైల్ రెండు వేరియంట్లలో గంటలకు లభిస్తుంది.. 8 జిబి రామ్ 128 జీబీ స్టోరేజ్ కలిగిన మొబైల్ రూ.19,999 రూపాయలతో కలదు.. 256GB ఉన్న మొబైల్  రూ.21,999 రూపాయలతో కలదు.6.67 అంగుళాల హెచ్డి డిస్ప్లే కలదు..50 mp ప్రధాన కెమెరా తో పాటు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా కలదు..5000 MAH బ్యాటరీ సామర్థ్యంతో కలదు..45 W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది.
3).TECNO -20 premier:
ఈ స్మార్ట్ మొబైల్ కూడా 6.67 అంగుళాల హెచ్డి డిస్ప్లే తో కలిగి ఉంటుంది..50 mp ప్రధాన కెమెరాతోపాటు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది..5000 MAH బ్యాటరీ సామర్థ్యం తో పాటు..45 W ఫాస్ట్ ఛార్జింగ్ కలుగుతుంది.. 8GB రామ్ 512 స్టోరేజ్ తో కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: