బుల్లి పిట్ట: హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన ఇండియన్ బ్రాండ్ మొబైల్..!!

Divya
ఇండియన్ బ్రాండ్ గా పేరు పొందిన లావా ఇటీవల కాలంలో మొబైల్స్ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునేందుకు సరికొత్త మొబైల్స్ సైతం విడుదల చేస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా కర్వ్డ్ డిస్ప్లే బడ్జెట్ స్మార్ట్ మొబైల్ ని కూడా తీసుకురావడం జరిగింది..LAVA AGNI -2 అనే పేరుతో ఈ రోజున మొదటిసారి ఈ సేల్ను తీసుకురావడం జరిగింది అయితే ఈరోజు ఉదయం 10 గంటలకు మొదలైన ఈ సెల్ నిమిషాలలోనే ముగిసినట్టు కనిపిస్తోంది. ఈ స్మార్ట్ మొబైల్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం.

లావా నుంచి విడుదలైన ఈ స్మార్ట్ మొబైల్ పూర్తి స్టాక్ అయిపోవడంతో షేర్ ముగిసినట్టుగా తెలుస్తోంది కానీ ఈ మొబైల్ యొక్క ఎన్ని యూనిట్ సేల్ అయ్యాయి అనే విషయం మాత్రం లావా కంపెనీ అధికారికంగా తెలియజేయలేదు..LAVA AGNI -2 స్మార్ట్ మొబైల్ ఇటీవలే ఇండియాలో కర్వ్డ్ డిస్ప్లే తో పాటు 5g ప్రాసెస్ తో ఆకర్షణీయమైన డిజైన్తో లాంచ్ కావడం జరిగింది. ఈ మొబైల్ మొదటి సెల్ మొదలైన గంట లోపే అవుట్ ఆఫ్ స్టాక్ అని బోర్డ్ పడడం జరిగింది ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ట్విట్టర్ నుంచి తెలియజేయడం జరిగింది.
ఈ ట్విట్టర్ నుండి..THANK YOU INDIA,WE ARE OUT OF STOCK అని తెలుపుతూ త్వరలోనే ఈ ఫోన్ స్టాక్ అందుబాటులోకి రాబోతుంది అంటూ ట్విట్టర్లో తెలియజేశారు ప్రస్తుతం ఈ ట్విట్ కాస్త తెగ వైరల్ గా మారుతోంది.. ఈ ట్విట్కు స్పందిస్తూ ఈ మొబైల్ కొన్న ప్రతి ఒక్కరు కూడా ఆర్డర్ స్క్రీన్ షాట్ పంచుకోవడం జరిగింది. వాస్తవానికి ఈ మొబైల్ గురించి సేల్ ముందు నుంచి మంచి హైప్ ఏర్పడింది.అందుకు కారణం ఈ మొబైల్ రూ.20 వేల లోపు ఉండడంతో పాటు  కర్వ్డ్ డిస్ప్లే ..50 mp వాడి కెమెరా సిస్టం తో పాటు లేటెస్ట్ ప్రాసెస్ తో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ వంటి తదితర ఫీచర్స్ ఉండడంతో పాటు ఫోన్ పాడైతే కొత్త మొబైల్ ఇస్తానన్నడంతో ఈ మొబైల్ కి మంచి హైప్ ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: