బుల్లి పిట్ట: బజాజ్ నుంచి సరికొత్త కారు.. కేవలం రూ.4 లక్షల లోపే..!!

Divya
ప్రస్తుతం ఉన్న రోజుల్లో నిరుద్యోగం నుంచి తప్పించుకునేందుకు యువత ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో తామే సొంతంగా ఏదైనా వాటిని ప్రారంభించాలని ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. మరి కొంతమంది బిజినెస్ పరంగా పెట్టుబడి పెట్టి బాగానే సంపాదిస్తున్నారు. అయితే ఇలాంటి వారిని గుర్తించి వారిని టార్గెట్ చేస్తూ బజాజ్ కంపెనీ ఒక కొత్త ఆటో రిక్షాను అందుబాటులోకి తీసుకువచ్చింది.. ముఖ్యంగా మీడియం రేంజ్ కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఆటో రిక్షాను డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది.
క్యూట్ RE -60 పేరిట విడుదల చేసిన ఆటో రిక్షాను పెట్రో సిఎస్జి వర్షన్ వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా కల్పిస్తోంది. లిక్విడ్ కూల్డ్  డి టి ఎస్ ఐ ఇంజన్ తో ఈ ఆటో రిక్షా అందుబాటులో ఉన్నది. అయితే దీని ధర ఎక్స్ షోరూం ప్రకారం రూ.2.48 లక్షల రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం వ్యక్తిగత అవసరాల గురించే కాకుండా వృత్తిపరమైన అవసరాలను గుర్తించుకొని ఈ ఆటో రిక్షాను ఉపయోగించుకోవచ్చట. దీంతో ఇప్పుడు ఈ కారు యొక్క ప్రత్యేకతలను ఒకసారి మనం తెలుసుకుందాం.

క్యూట్ RE -60 అనేది ఇండియాలో తయారుచేసిన మొట్టమొదటి క్వాడ్రిసైకిల్ . దీన్ని నాలుగు చక్రాల ఆటో రిక్షా గా పిలుస్తున్నారు.. ఇందులో 2+2 సిట్టింగ్ తో పాటు పైకప్పు డోర్ స్టీరింగ్ వీలు కూడా కలవు పెట్రోల్ లేదా కంప్రెసర్ నేచురల్ గ్యాస్ ద్వారా ఇది పనిచేస్తోంది .అయితే..216.6 సీసీ లిక్విడ్ కోల్డ్ ఇంజన్ దీని ప్రత్యేకత.. ఇక పెట్రోల్ 13.1 పిఎస్ లేదా 18.9 NM కంప్రెస్ సహజవాయువుపై పనిచేస్తుంది.ఇది పెట్రోల్ పైన 35 కిలోమీటర్లు సిఎస్ పైన 43 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది బజాజ్ క్యూట్ RE -60 ధర ఆన్ రోడ్ ప్రైజ్ విషయానికి వస్తే .. రూ.3.61 లక్షల రూపాయలకి అందుబాటులోకి లభిస్తుందట. ఇది సామాన్యులకు కూడా అందుబాటులో కలిగించే విధంగా ఉండబోతోంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: