హీరో ఎలక్ట్రిక్: 3 పవర్ ఫుల్ E-స్కూటర్స్ విడుదల?

ఇక హీరో ఎలక్ట్రిక్ కంపెనీ ఎట్టకేలకు తన కొత్త స్మార్ట్ కనెక్ట్ చేయబడిన ఆప్టిమా CX, NYX ఎలక్ట్రిక్ మోడళ్లను ఇండియన్ ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లో విడుదల చేసింది.ఆప్టిమా CX5.0 (డ్యూయల్ బ్యాటరీ), ఆప్టిమా CX2.0 (సింగిల్ బ్యాటరీ) ఇంకా అలాగే NYX CX5.0 (డ్యూయల్ బ్యాటరీ) అనే మూడు కొత్త స్కూటర్లను కంపెనీ పరిచయం చేసింది.ఎన్నో ఆకర్షణీయమైన ఫీచర్లతో పాటు లేటెస్ట్ అప్డేటెడ్ టెక్నాలజీతో ఈ స్కూటర్లను హీరో కంపెనీ ప్రవేశ పెట్టింది. ఇక మొత్తం ఈ స్కూటర్స్ లో తీసుకువచ్చిన వివిధ అంశాలతో పాటు ఇతర విషయాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇంకా ఈ స్కూటర్ల ధరల విషయానికొస్తే, హీరో ఎలక్ట్రిక్ కంఫర్ట్, సిటీ స్పీడ్ స్కూటర్ల ధర రూ. 85 వేలు, రూ. 95 వేలు రూ. 1,05,000, రూ. 1,30,000 ధరల రేంజిలో కొనుగోలు చేయడానికి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇక సిటీలను బట్టి ఈ స్కూటర్ల ధరలు అనేవి మారనున్నాయి.ఇక ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లపై సాఫీగా ప్రయాణించేందుకు అప్డేటెడ్ జపనీస్ మోటార్ టెక్నాలజీలతో వీటిని కంపెనీ తీసుకువచ్చింది. మన ఇండియా వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా జర్మన్ ECU టెక్నాలజీని ఈ స్కూటర్లకు జోడించారు. ICE ఇంజిన్ స్కూటర్‌ల డిజైన్ ఎంతో ఆకర్షణీయమైన లుక్‌లో మంచి ఫ్యూచరిస్టిక్ డిజైన్‌ను ఈ స్కూటర్స్  కలిగి ఉన్నాయి.


ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఓలా, ఈథర్, టీవీఎస్ ఐక్యూబ్ ఇతర ఫేమస్ ఎలక్ట్రిక్ స్కూటర్లతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు పోటీపడనున్నాయి.Optima CX5.0 3 kWh C5 Li-ion బ్యాటరీతో వస్తుంది. ఇది 165 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో గరిష్టంగా 55 kmph వేగంతో ప్రయాణిస్తుంది. ఏకకాలంలో ఈ స్కూటర్ చార్జింగ్ కావడానికి దాదాపు 3 గంటల టైం పడుతుంది.ఇక Optima CX2.0 విషయానికొస్తే... ఇది మాక్సిమం 48 kmph స్పీడ్ తో దూసుకెళ్తుంది.అలాగే Optima CX5.0 వంటి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్‌ను కూడా అందిస్తుంది.ఈ స్కూటర్ ని 4.5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.ఇది స్పీడ్ తో పాటు అన్నీ విధాల కస్టమర్ కు నచ్చేలా చాలా ఈజీగా ఈ స్కూటర్ పై రైడ్ చేసేలా ప్రత్యేకంగా కంపెనీ డిజైన్ చేసింది.3 ఎలక్ట్రిక్ స్కూటర్లలో బ్యాటరీ సేఫ్టీ అలర్ట్, డ్రైవ్ మోడ్ లాక్, రివర్స్ రోల్ ప్రొటెక్షన్ ఇంకా సైడ్ స్టాండ్ సెన్సార్లు వంటి మెరుగైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇక వీటి కలర్ల విషయానికి వస్తే Optima CX5.0 డార్క్ మ్యాట్ బ్లూ ఇంకా మ్యాట్ మెరూన్ రంగులలో లభిస్తుంది.ఇంకా అలాగే Optima CX2.0 డార్క్ మ్యాట్ బ్లూ, చార్‌కోల్ బ్లాక్‌లో ఈ స్కూటర్ అందుబాటులో ఉంది. NYX CX5.0 చార్‌కోల్ బ్లాక్, పెరల్ వైట్ కలర్లలో హీరో ఎలక్ట్రిక్ కంపెనీ తీసుకువచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: