ఒక్క ఛార్జ్ తో 300 కి.మీ. రేంజ్ ని ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్?

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరిగిపోయింది. ఇక ఈ వాహనాలు కూడా కొత్త కొత్త ఎలక్ట్రానిక్ ఫీచర్లతో రావడం ఇప్పుడు అనివార్యమవుతోంది.ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల్లో సరికొత్త ఫీచర్లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. తక్కువ బడ్జెట్‌లో డిజిటల్ ఫీచర్లు ఇంకా ఆకర్షణీయమైన డిజైన్‌ లపై కొనుగోలుదారులు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు.ఇంకా ఇదే క్రమంలో ఈ శ్రేణిలో ప్రస్తుతం మార్కెట్లో హల్ చల్ చేస్తున్న ఓలా, హోండా యాక్టివా వంటి కంపెనీలు పోటీగా హార్విన్ సెన్మెంటి ఎలక్ట్రానిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మీరు కూడా మంచి ఫ్యూచర్ లతో సరి కొత్త స్కూటర్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఇది మీకు చాలా మంచి బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఈ స్కూటర్లో అత్యాధునిక ఫీచర్లు ఇంకా భద్రతకు ప్రాధాన్యమిస్తూ కెమెరా కూడా మీకు అందుబాటులో ఉంది.ఇంకా అంతేకాక ప్రస్తుతం ఎలక్ట్రికల్ స్కూటర్లలో అత్యధిక మైలేజీని దాదాపు సింగిల్ చార్జ్ పై ఏకంగా 300 కిలోమీటర్లు రేంజ్ ని ఇస్తుందని కూడా కంపెనీ ప్రకటించింది.


ఇక హార్విన్ సెన్మెంటి ఎలక్ట్రానిక్ స్కూటర్ ఆకర్షణీయమైన డిజైన్, అప్డేటెడ్ టెక్నాలజీతో వస్తోంది. దీనిలోని బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేస్తే ఏకంగా 300 కిలోమీటర్ల రేంజిని కలిగి ఉంటుంది. మీరు ఎక్కువ దూరం ప్రయాణించే స్కూటర్‌ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఇతర కంపెనీలతో పోల్చితే ఈ స్కూటర్ మీకు తక్కువ ధరకే మంచి రేంజ్‌ను అందిస్తోంది.ఇక హార్విన్ కంపెనీకి చెందిన ఈ ఎలక్ట్రానిక్ స్కూటర్ ప్రత్యేకమైన డిజిటల్ ఫీచర్లను అందిస్తుంది. ఇంకా అంతేకాక సేఫ్టీకి అధిక ప్రాధన్యమిస్తూ దగ్గరలోని వస్తువులను గుర్తించగల కెమెరాను ఇందులో అమర్చారు. దూర ప్రాంతాలకు ప్రయాణించాలనుకుంటే ఇదే మీకు చాలా మంచి స్కూటర్. ఎందుకంటే దీన్ని మీరు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 కి.మీ. రేంజ్ తో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: