బుల్లి పిట్ట: మొబైల్ తోనే ఆపరేటింగ్ చేసి ట్రాక్టర్..!!

Divya
రైతులు ఎక్కువగా పొలం దున్నాలి అంటే.. ఎక్కువగా ట్రాక్టర్ ను ఉపయోగిస్తూ ఉంటారు. అందరి రైతుల దగ్గర సొంతగా ట్రాక్టర్ ఉండదు. కేవలం కొంతమంది రైతుల దగ్గర తప్ప చిన్న రైతుల దగ్గర ఉండదు.దీంతో ట్రాక్టర్లు అద్దెకు తెచ్చుకోవాల్సి ఉంటుంది. తెలిసినవాళ్లు ట్రాక్టర్ అయితే తక్కువ డబ్బులకు ఇచ్చిన డ్రైవర్లు దొరకడం చాలా కష్టమని చెప్పవచ్చు.. దీంతో డిమాండ్ ఎక్కువ చేస్తారు కాబట్టి.. ఎక్కువగానే డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. అయిల్ రైతు కోటీస్తే డ్రైవర్ కి గంటకు ఇంతని ఛార్జ్ చేయడం జరుగుతూ ఉంటుంది.

ఎందుకంటే డ్రైవర్ బతకాలి కదా రైతులకి భారం అవుతుంది.. అయితే అవసరమనేది అందరికీ ఉంటుంది. కొంతమంది డ్రైవరు తమకు నచ్చినట్టుగా పనిచేస్తూ ఉంటారు.ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు ఇలాంటి సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం దొరకబోతోంది. డ్రైవర్ రహిత ట్రాక్టర్లు సాంకేతిక ను వాడుకొని మొబైల్ ఫోన్ తోనే  డ్రైవర్ లేకపోయినా దర్జాగా పొలం పనులు చేసుకోవచ్చట. ట్రాక్టర్ను డ్రైవర్ లేకపోయినా నడపవచ్చు డ్రైవర్ లేకపోయినా స్టీరింగ్ దానికి అంతట అదే తిరుగుతుంది. గేర్లు కూడా వాటంత అవే మారుతాయి. ట్రాక్టర్ను వెనక్కి ముందుకు నచ్చినట్లు మనం నడుపుకోవచ్చు.
ఈ పరిజ్ఞానాన్ని వరంగల్ కిడ్స్ కళాశాల ప్రొఫెసర్ నరసింహారెడ్డి ఆవిష్కరించడం జరిగింది. దీనికి డ్రైవర్ రహిత ట్రాక్టర్ అని పేరు కూడా పెట్టారు. కేంద్ర శ్రేష్ట సాంకేతిక విభాగం కింద గడిచిన 2020 ఫిబ్రవరిలో రూ.41 లక్షల ఈ ప్రాజెక్టు కోసం మంజూరు చేసినట్లు తెలుస్తోంది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ డాక్టర్ నిరంజన్ రెడ్డి మున్సిపల్ తో ఈ ప్రాజెక్టును వ్యవహరించినట్లు తెలుస్తోంది. మూడేళ్ల పాటు శ్రమించి ఈ డ్రైవర్ రెహిత ట్రాక్టర్ విజయవంతం గా మొబైల్ కంట్రోల్ తో ఆపరేటింగ్ చేయవచ్చు. రాబోయే రోజుల్లో వీటిని అన్నిచోట్ల పాపులర్ చేస్తారెమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: