కొత్త టెక్నాలజీ, ఫీచర్స్ తో వచ్చిన హ్యుందాయ్ ఆరా?

ఇక హ్యుందాయ్ కంపెనీ తన లేటెస్ట్ ఆరా ఫేస్‌లిఫ్ట్ సెడాన్‌ను ఇండియన్ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. ఇక కంపెనీ ఇప్పుడు ఈ సెడాన్ కోసం బుకింగ్స్ ఓపెన్ చెయ్యడం కూడా స్టార్ట్ చేసింది.హ్యుందాయ్ కంపెనీ  'ఆరా' ను 2020 జనవరిలో ప్రవేశపెట్టిన తరువాత కొత్త టెక్నాలజీ ఇంకా కొత్త అప్డేట్స్ తో తీసుకురావడం ఇదే ఫస్ట్ టైం. ఇక ఈ సెడాన్ కొనాలనే కస్టమర్లు రూ. 11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ కార్ ధరలు కూడా త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంటుంది.ఈ కొత్త హ్యుందాయ్ ఆరా ఫేస్‌లిఫ్ట్ చాలా మంచి డిజైన్ పొందుతుంది. ఇందులో అతి పెద్ద అప్‌డేట్ వచ్చేసి దాని ఫ్రంట్-ఎండ్ డిజైన్.ఎందుకంటే ఇందులో రెండు భాగాలుగా  ఉన్న గ్రిల్ ని చూడవచ్చు. గ్రిల్ ఇంకా బానెట్ మధ్య బ్రాండ్ లోగో ఉంటుంది. కింద భాగంలో ఉన్న బంపర్ కూడా బాగా విశాలంగా ఉంటుంది. ఇది పాత మోడల్ కంటే కూడా విశాలంగా ఉంటుంది.ఇంకా ఈ కార్ కి కొత్త ఇన్వర్టెడ్ ఎల్ ఆకారపు LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ సెడాన్ లో ఫాగ్ ల్యాంప్‌లు మాత్రం లేవు. ఫ్రంట్ బంపర్‌  చాలా అందంగా కనిపిస్తుంది. అయితే సైడ్ ప్రొఫైల్ లో ఎలాంటి అప్డేట్స్ లేదు. అందువల్ల అల్లాయ్ వీల్స్ దాని పాత మోడల్ లాగానే ఉన్నాయి. బ్యాక్ సైడ్ బూట్-లిడ్ స్పాయిలర్ ఉంది. మిగిలిన మొత్తం దాని పాత మోడల్ లాగానే ఉంటుంది.


ఇంకా ఈ కొత్త అప్డేటెడ్ హ్యుందాయ్ ఆరా ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ క్యాబిన్ పాత మోడల్ లాగానే ఉన్నప్పటికీ, సీట్లు కొత్త అపోల్స్ట్రే కలిగి, లెదర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ ఇంకా ఫుట్‌వెల్ ప్లేస్ కి కొత్త లైటింగ్‌ ఉండటం చూడవచ్చు. ఇంకా అంతే కాకుండా ఇందులో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ కూడా ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో ఇంకా ఆపిల్ కార్ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది.అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్‌, కొత్త టైప్ సి ఛార్జింగ్ పోర్ట్‌లు ఇంకా రియర్ AC వెంట్‌లు ఉన్నాయి. ఈ కారులో 3.5 ఇంచెస్ డిజిటల్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది కార్ గురించి డ్రైవర్ కి చాలా సమాచారం అందిస్తుంది. దీనిలో ఇంటీరియర్ డిజైన్ ఇంకా ఫీచర్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి.ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ పొందుతుంది. ఈ ఇంజిన్ 83 హెచ్‌పి పవర్ ఇంకా 113.8 ఎన్ఎమ్ టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్‌తో యాడ్ చేయబడుతుంది. ఇంకా అంతే కాకుండా ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌లో cng ఆప్సన్ కూడా ఉంటాయి. ఇది 69 హెచ్‌పి పవర్ ఇంకా 95.2 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అయితే ఈ కార్ లో కేవలం 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ మాత్రమే  అందుబాటులో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: