బుల్లి పిట్ట: వాట్సాప్ నుంచి మరొక సరికొత్త ఫీచర్..!!
డోంట్ డిస్ట్రబ్ అని ఫీచర్ను వాట్సాప్ పరిచయం చేసింది కొంతమంది యూజర్లకు ఈ ఫీచర్ ఇప్పటికి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం బీటా వెర్షన్లో మాత్రమే ఈ ఫీచర్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. టెస్టింగ్ స్టేజ్ లో ఉన్న ఈ ఫీచర్ ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ఆ సంస్థ తెలియజేస్తోంది. అయితే ఈ డోంట్ డిస్ట్రబ్ ఫీచర్ కేవలం వెబ్ వెర్షన్లకు ఉపయోగిస్తున్న వారికి మాత్రమే అందుబాటులోకి తీసుకురాబోతున్నారు
వెబ్ వెర్షన్ లో ఉపయోగిస్తున్న సమయంలో ఇన్కమింగ్ కాల్స్ వచ్చినప్పుడు వాటినీ నోటిఫికేషన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఉపయోగించుకోవాలనుకుని యూజర్లు సెట్టింగ్ ఆప్షన్ లోకి వెళ్లి ఇన్కమింగ్ వాట్సాప్ కాల్ నోటిఫికేషన్ ఆఫ్/ఆన్ చేసుకోవచ్చు.. ఇదంతా ఇలా ఉంటే వాట్సప్ గత కొన్ని రోజులుగా సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉన్నది. మొన్నటికి మొన్న కాంటాక్ట్ కార్డులను షేర్ చేసి ఫీచర్లను తెచ్చిన వాట్సాప్ అవతార్ అని ఒక కొత్త ఫిచర్ ను మళ్ళీ పరిచయం చేసింది. దీనివల్ల మీ ప్రొఫైల్ ఫోటోను డిజిటల్ వర్షం కుపొందించుకోవచ్చు. అంతేకాకుండా ఫోటోకు హెయిర్ స్టైల్ ఫేషియల్ ఫీచర్స్ కూడా యాడ్ చేసుకునే విధంగా అప్డేట్ చేసింది.