అలాంటి యూట్యూబర్లకి కేంద్రం బిగ్ షాక్.. ఇక కఠిన శిక్షే?

దేశంలో రోజు రోజుకి యూట్యూబ్ ఛానెల్స్ ట్రెండ్ బాగా పెరుగుతోన్న సంగతి తెలిసిందే. డబ్బుల కోసం చాలా మంది యూట్యూబర్లగా మారి వ్యూస్ కోసం దారుణమైన కంటెంట్ తో వీడియోలు చేస్తున్నారు. ఇక కొన్ని ఛానెల్స్ అయితే జాతి, కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక ప్రచారంతో కూడిన కంటెంట్‌ను క్రియేట్ చేసి బాగా వ్యూస్ సాధించి డబ్బులు సంపాదిస్తున్నాయి. దీంతో ఇటువంటి ఛానెల్స్‌కు అడ్డుకట్టు వేసేందుకు కేంద్రం ఎప్పటికప్పుడు అనేక రకాల చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఈమధ్య ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బ్యూరో(పీఐబీ) ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తోన్న మరో 3 యూట్యూబ్ ఛానెల్స్‌ను బ్లాక్ చేయడం జరిగింది. ఆ ఛానెల్స్ సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంకా అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా తప్పుడు కంటెంట్ ని సృష్టించడంతో పాటు పర్సనల్ గా కూడా టార్గెట్ చేస్తూ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాయని పీఐబీ గుర్తించింది. ఇక ఈ 3 ఛానెల్స్‌కు సుమారు 33 లక్షల సబ్‌స్కైబర్లు ఉన్నారు. వాటిల్లో వస్తున్న అవుతున్న వీడియోలు దాదాపు అన్నీ కూడా ఫేక్ కంటెంట్‌తో కూడినవని ఇంకా వాటిని సుమారు 30 కోట్లకుపైగా చూశారని పీఐబీ తేల్చింది.


అలాగే ఫేక్ ప్రచారం చేస్తోన్న ఛానెల్స్ సంబంధించిన వివరాలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో బట్ట బయలు చేయడం ఇదే మొదటిసారి. పీఐబీ బ్లాక్ చేసిన యూట్యూబ్ ఛానెల్స్ జాబితాలో న్యూస్ హెడ్‌లైన్స్(9.67 లక్షల సబ్‌స్క్రైబర్స్), సర్కారీ అప్‌డేట్(22.6 లక్షల సబ్‌స్క్రైబర్స్) ఇంకా అలాగే ఆజ్‌తక్ లైవ్((65.6 లక్షల సబ్‌స్క్రైబర్స్) ఛానల్స్ ఉన్నాయి. ఈ యూట్యూబ్ ఛానెల్స్ సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌లు(EVMలు) ఇంకా అలాగే వ్యవసాయ రుణాల మాఫీ వంటి వాటిపై ఫేక్, కాంట్రవర్సీయల్ కంటెంట్‌ను క్రియేట్ చేసి ప్రచారం చేస్తున్నాయి. పైగా ఆ వీడియోలకు ఫేక్ లోగోలు, అసహ్యంగా వుండే థంబ్‌నెయిల్స్ పెట్టి వ్యూయర్స్ ని తప్పుదారి పట్టిస్తున్నట్లు పీఐబీ కన్ఫర్మ్ చేసింది. ఈ ఛానెల్‌లు తమ వీడియోలను ప్రకటనలుగా చూపిస్తూ యూట్యూబ్‌లో ఫేక్ ఇన్ఫర్మేషన్ ని మానిటైజ్ చేస్తున్నట్లు కనిపెట్టింది.గత సంవత్సరం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వందకు పైగా యూట్యూబ్ ఛానెల్స్‌లను బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: