బుల్లి పిట్ట: ఐఫోన్ -14 పై భారీ డిస్కౌంట్..?

Divya
యాపిల్ మొబైల్ ని లైక్ చేయని వారు అంటూ ఎవరు ఉండరు.  ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడో ఒకసారి ఈ మొబైల్ ని కచ్చితంగా ఉపయోగించాలని అనుకుంటూ ఉంటారు. ఇలా ఎన్నో సీరీస్ లో ఇప్పటివరకు యాపిల్ సంస్థ నుంచి విడుదల అవుతూనే ఉన్నాయి. తాజాగా ఐఫోన్ 14 పైన భారీ డిస్కౌంట్ ను  అందించనుంది ఈ సంస్థ. ఐఫోన్ -14 ప్రో, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో మాక్స్ వంటి వేరియంట్ లలో  ఈ ఏడాది సెప్టెంబర్లో పలుమొబైల్స్ విడుదల చేసింది ఈ సంస్థ.
అమెజాన్లో కొత్త ఐఫోన్ 14 ధర రూ.57,000 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు.. ఈ సిరీస్ లో యాపిల్ ఐఫోన్ అసలు ధర రూ.79,900 రూపాయల నుంచి ప్రారంభం కాగా ఇందులో 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర కలదు. ఇక అమెజాన్లో ఈ మొబైల్ ప్రస్తుతం రూ.57,000 రూపాయలు కలదు. అమెజాన్లో ఈ మొబైల్ రూ.78,400 ఉండగా hdfc బ్యాంకు కార్డు ద్వారా ఈ మొబైల్ పైన రూ.5000 డిస్కౌంట్ కలదు దీంతో పాటు ఈ మొబైల్ పైన ఎక్స్చేంజింగ్ ఆఫర్ కూడా కలదు.  అయితే ఈ ఆఫర్ పొందాలి అంటే మీ మొబైల్ మంచి కండిషన్ తో ఉండడంతో పాటు దాని విలువ రూ.16,300 వరకు ఎక్సైజ్ ఉండాలి.
ఇలా ఒకేసారి ఐఫోన్ 14 పైన ఆఫర్లు రాగా రూ.57,100 రూపాయలకే ఈ మొబైల్ లభిస్తుంది దీంతో ఈ మొబైల్ దాదాపుగా రూ.21,000 వేలకు పైగా తగ్గుతుంది. ఐఫోన్ 14 మొబైల్ స్పెసిఫికేసన్ విషయానికి వస్తే..6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్డి ఆర్  ఓఎల్ఈ డిస్ప్లేను కలదు. ముఖ్యంగా నిట్స్ పిక్ బ్రైట్నెస్ 1200 కలదు. బ్యాటరీ , స్టోరేజ్ విషయాలను యాపిల్ అధికారికంగా ప్రకటించలేదు. కానీ కొన్ని థర్డ్ పార్టీ వీడియోలు మాత్రం వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: