ఐవోమి ఎనర్జీ నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్స్?

ఇండియన్ మార్కెట్లో 'ఐవోమి ఎనర్జీ' విడుదల చేసిన కొత్త 'ఎస్1' ఎలక్ట్రిక్ స్కూటర్స్ చాలా బాగున్నాయి. వీటి స్టార్టింగ్ ధరలు రూ. 69,999 (ఎక్స్-షోరూమ్), ఇక టాప్ మోడల్ ధర రూ. 1.12 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.కొత్త ఐవోమి ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్  మొత్తం మూడు వేరియంట్స్ లో మనకు అందుబాటులో ఉంటుంది. అవి ఎస్1 80, ఎస్1 200 ఇంకా ఎస్1 240 వేరియంట్లు. ఐవోమి ఎస్1 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు 2022 డిసెంబర్ 01 నుంచి కంపెనీ  అన్ని అఫీషియల్  డీలర్షిప్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్  ఉన్నవారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను చాలా ఈజీగా కొనుగోలు చేయవచ్చు.ఐవోమి ఎస్1 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక సింగిల్ ఛార్జ్ తో  మాక్సిమం 240 కిలోమీటర్ల (ఎస్1 240 వేరియంట్) రేంజ్ ని అందిస్తాయని కంపెనీ వెరిఫై చేసింది. అలాగే ఇందులో 4.2 కిలోవాట్ ట్విన్ బ్యాటరీ ప్యాక్ ఇంకా 2.5 కిలోవాట్ల మోటార్ కూడా అందుబాటులో ఉంటుంది.


అయితే ఎస్1 80 వేరియంట్ ఒక సింగిల్ ఛార్జ్ తో మాక్సిమం 80 కిమీ రేంజ్ అందిస్తుంది.ఈ ఎస్1 80 వేరియంట్ లో 1.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది మాక్సిమం గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ముందుకు వెళుతుంది. ఇక ఈ అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా స్టాండర్డ్ గా మూడు రైడింగ్ మోడ్స్ కలిగి ఉంటాయి. అవి ఎకో మోడ్, రైడర్ మోడ్ ఇంకా స్పోర్ట్ మోడ్స్. కంపెనీ  పాత S1 మోడల్‌ కూడా రూ. 85,000 (ఎక్స్-షోరూమ్) ధరతో అందుబాటులో ఉంది.ఈ ఐవోమి ఎస్1 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు మొత్తం మూడు కలర్ ఎంపికలో అందుబాటులో ఉంటాయి. అవి పీకాక్ బ్లూ, నైట్ మెరూన్ ఇంకా డస్కీ బ్లాక్ కలర్స్. ఇవన్నీ కూడా ఎంతగానో ఆకర్షణీయంగా ఉంటాయి. అలాగే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో GPS ట్రాకర్ ఇంకా మానిటరింగ్ సిస్టమ్‌తో పాటు కొత్త 'ఫైండ్ మై రైడ్' అనే లేటెస్ట్ ఫీచర్‌ కూడా అందుబాటులో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: