వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్?
ఐఓఎస్ 22.18.0.72 అప్‌డేట్ కోసం వాట్సాప్ బీటా, వాట్సాప్ గ్రూప్‌లోనే సభ్యుని ఫోటోను చూపించడానికి కొత్త ఫీచర్‌పై పని చేస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత డెస్క్‌టాప్ బీటా కోసం కూడా వాట్సాప్ ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఫీచర్ కొంతమంది యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. దీని గ్లోబల్ లాంచ్‌ను కంపెనీ ప్రకటించలేదు. అయితే రాబోయే కాలంలో ఈ ఫీచర్ మిగిలిన వినియోగదారులకు కూడా అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.ఇక ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందంటే..గ్రూప్‌లోని సభ్యుల మెసేజ్‌లో పేరు పక్కన ఒక సింబల్ కనిపిస్తుంది. దానిపై వినియోగదారు ప్రొఫైల్ ఫోటో కనిపిస్తుంది. మీ అకౌంట్‌లో ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసి ఉంటే, గ్రూప్‌లో మెసేజ్‌కి ముందు ఫోటోను మీరు చూస్తారని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. ఇది మంచి UI అడిషన్. గ్రూప్ లోని సభ్యులు ఒకరినొకరు గుర్తించడంలో సహాయపడుతుంది. అలాగే సభ్యునికి ప్రొఫైల్ ఫోటో లేకపోయినా లేదా ప్రైవసీ సెట్టింగ్‌ల కారణంగా ప్రొఫైల్ ఫోటో కనిపించకపోతే ఫోటోకు బదులుగా మెసేజ్ కలర్ సింబల్ కనిపిస్తుంది.