అఖండ 2 : మళ్లీ అదే తప్పు చేస్తే కలెక్షన్లపై పెద్ద ఎఫెక్ట్ పడనుందా..?

Pulgam Srinivas
నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలయ్య ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకున్నాడు. బాలయ్య గత కొంత కాలంగా వరుస పెట్టి విజయాలను అందుకుంటూ వస్తున్నాడు. కొంత కాలం క్రితం బాలయ్య "అఖండ" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమాకు కొనసాగింపు అఖండ 2 మూవీ ని రూపొందించారు. ఈ సినిమాను డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను డిసెంబర్ 4 న ప్రదర్శించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ మరియు రెగ్యులర్ షో లా టికెట్ బుకింగ్స్ కూడా కొన్ని ప్రాంతాలలో ఓపెన్ అయ్యాయి. ఇకపోతే ఈ మూవీ కి సంబంధించిన టికెట్ బుకింగ్లు చాలా లేటుగా ఓపెన్ అయ్యాయి. ఈ సినిమా విడుదలకు సమయం అత్యంత దగ్గర పడిన సమయంలో ఈ మూవీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.


ఇక ఈ సినిమా డిసెంబర్ 5 వ తేదీన విడుదల కావాల్సి ఉంటే 4 వ తేదీ సాయంత్రం వరకు కూడా ఈ మూవీ టికెట్స్ తెలంగాణ రాష్ట్రంలో  ఓపెన్ కాలేదు. దానితో తెలంగాణ రాష్ట్రంలో ఈ సినిమా టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయా లేదా అని అనుమానాలు కూడా కొంత మంది లో వ్యక్తం అయ్యాయి. ఇకపోతే ఈ సినిమా డిసెంబర్ 5 వ తేదీన విడుదల వాయిదా పడింది. ఈ మూవీ ని డిసెంబర్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు , ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను డిసెంబర్ 11 వ తేదీన ప్రదర్శించనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. దానితో ఈసారైనా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్లను ప్రపంచ వ్యాప్తంగా కాస్త ఎర్లీగా ఓపెన్ అయ్యలా జాగ్రత్త పడితే ఈ మూవీ కి ప్రీమియర్స్ మరియు మొదటి రోజు తో కలిపి భారీగా కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: