బుల్లి పిట్ట: ఇయర్ ఫోన్స్ తో ఎన్ని ప్రమాదాలో తెలుసా..?
ఇయర్ ఫోన్స్ ని ఎక్కువగా ఉపయోగిస్తే వినికిడి సమస్యతో పాటు పలు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు. మనం1.1 బిలియన్ మందికి పైగా ఎక్కువ సౌండ్స్తో పాటలు వినడం వల్ల వినికిడి శక్తి తగ్గే ప్రమాదం ఉందని WHO ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఇయర్ ఫోన్స్, ఇయర్ బర్డ్స్ , బ్లూటూత్ అంటే వాటితో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాము వీటివల్ల ఎక్కువ శబ్దంతో మ్యూజిక్ వినడం వల్ల అది వినికిడి పైన ప్రభావం చూపిస్తుందట. నాసిరకం ఎయిర్ ఫోన్స్ వాడడం వల్ల చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుందని తెలియజేస్తున్నారు వైద్యులు.
ఇయర్ ఫోన్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఏకాగ్రత కూలిపోతారని.. ముఖ్యంగా ఇతరులు ఉపయోగించిన ఇయర్ ఫోన్లో మరొకరు వాడడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉన్నదట. అయితే ఇయర్ ఫోన్స్ కు బదులుగా హెడ్ ఫోన్లు ఉపయోగించడం వల్ల సౌండ్ కు కర్ణభేరికి మధ్య గ్యాప్ ఉంటుందని తెలియజేస్తున్నారు వైద్యులు. లేదంటే ఏదైనా బ్రాండెడ్ కలిగిన ఇయర్ ఫోన్స్ తో తక్కువ వాల్యూమ్ తో కేవలం గంటా రెండు గంటలు ఉపయోగించి వదిలేయాలని తెలియజేస్తున్నారు.