బుల్లి పిట్ట: ఆధార్ వివరాల అప్డేట్ ను మీరే ఇలా చేసుకోండి..!!
1). ముందుగా మొబైల్లో లేదా ల్యాప్ టాప్ లో అధికారిక వెబ్సైట్ UIDAI.GOV.IN సైట్ ను ఓపెన్ చేయాలి.
2). అక్కడ మైన్ పేజీలో థర్డ్ ఆప్షన్ల update address in your aadhar అనే ఆప్షన్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన వెంటనే అక్కడ ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
3). అలా ఓపెన్ అయిన వెంటనే అక్కడ చూపించిన క్యాప్చాను సరిగ్గా ఎంటర్ చేసి ఓటిపి ఆప్షన్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది.
4). మీ ఆధార్ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ పైన ఓటిపి సెండ్ చేయబడుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయడంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
5). ఇక అక్కడ చూపించిన విధంగా చేంజ్/అప్డేట్ కోసం అడ్రస్ ఆప్షన్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక అక్కడ మనం మన వివరాలను నింపి ఐడెంటి ప్రూఫ్ ను కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ పైన మరొక ఓటీపీ సెండ్ చేయడం జరుగుతుంది. ఆ ఓటీపీ నెంబర్ను ఎంటర్ చేసి సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయవలసి ఉంటుందట.
6). ఇక దీంతో అడ్రస్ చేంజ్ రిక్వెస్ట్ కోసం అప్లై చేసుకున్నట్లయితే మీ అడ్రస్ చేంజ్ రిక్వెస్ట్ ప్రాసెస్ అయిందో లేదో తెలుసుకోవచ్చు.. update request number అనే ఆప్షన్ను ఉపయోగించి తెలుసుకోవచ్చు.