బుల్లి పిట్ట: సాంసంగ్ 5-G మొబైల్.. రూ.11,000 లకే..!!

Divya
ప్రముఖ బ్రాండెడ్ లో ఒకటైన సాంసంగ్ ఎన్నో మోడల్స్ ను తమ యూజర్స్ కోసం ప్రవేశ పెడుతూ వస్తోంది. ఇక ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ ను కూడా తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ సెల్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కాబోతోంది ఇప్పటికే ఎన్నో గొప్ప ఆఫర్లను సైతం ఫ్లిప్ కార్ట్ ప్రకటించడం జరిగింది. ఇక రాబోయే మొబైల్స్ ధరల విషయంలో కూడా ప్రోడక్ట్ల విషయంలో కూడా చాలా తక్కువ ధరలకే పలు ఎలక్ట్రిక్ వస్తువులను కూడా తమ కస్టమర్ల కోసం డిస్కౌంట్ ప్రకటిస్తూ వస్తోంది.

అలా ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో బెస్ట్ ఆఫర్ గా ఉన్న సాంసంగ్  గెలాక్సీ -F13 మొబైల్ ఒకటి అని చెప్పవచ్చు సాంసంగ్ తెచ్చిన ఈ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ మొబైల్ 5g మొబైల్ చౌక ధరకే ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ మొబైల్ ని మనం తీసుకోవచ్చు ఈ స్మార్ట్ మొబైల్ ఆఫర్ ధర కేవలం ప్రస్తుతం రూ.10,999 రూపాయలకే పొందే అవకాశాన్ని ఫ్లిప్ కార్ట్ కస్టమర్లకు అందిస్తోంది. సాంసంగ్ గెలాక్సీ M-13 ఫైవ్ జి మొబైల్ 4gb ram+64gb మెమొరీ వేరెంటు గల మొబైల్ ఈరోజు రూ.12,499 రూపాయలకే అందిస్తోంది ఈ మొబైల్ యాక్సిస్, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్నట్లు అయితే అదనంగా రూ. 1500 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్లు అన్నీ కలుపుకొని ఈ మొబైల్ రూ.10,999 రూపాయలకే మనం పొందవచ్చు.

సాంసంగ్ నుంచి వచ్చిన ఈ మొబైల్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే..6.6 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే తో పాటు 120 hz రిఫ్రిష్ రేటుతో కలదు. ఈ ఆండ్రాయిడ్ మొబైల్ 12 os పైన పనిచేస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే 50 mp మెయిన్ కెమెరా,8 మెగా పిక్సెల్ కెమెరా సెల్ఫీ ప్రియుల కోసం కలదు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 Mah సామర్థ్యంతో కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: