బుల్లి పిట్ట: ఒప్పో నుంచి సరికొత్త మొబైల్.. ధర ఫీచర్లు ఇవే..!!

Divya
ప్రముఖ బ్రాండెడ్ కలిగిన ఒప్పో తాజాగా సరికొత్త మొబైల్ విడుదల చేయడం జరిగింది. ఈ మొబైల్లో సరికొత్త ప్లాగ్ షిప్ కెమెరా, సెంట్రిక్ రెనో స్మార్ట్ ఫోన్ మోడల్ తో సరికొత్త అప్డేట్ తో విడుదలకు సిద్ధంగా ఉంది. బ్రాండెడ్ సమాచారం ప్రకారం ఇందులో రెండు రకాల మొబైల్స్ విడుదలబోతున్నాయి అందులో రెనో -8, రెనో -8 ప్రొ మొబైల్స్ విడుదలబోతున్నాయి ఇవి జూలై 18 వ తేదీన ఇండియాలో విడుదలబోతున్నట్లు ఆ కంపెనీ సంస్థ ప్రకటించింది. ఈ సరికొత్త రెనో కలిగిన మొబైల్ పరికరాలు.. హై క్వాలిటీ కెమెరా, సిస్టములు, సరికొత్త డిజైన్తో హై రిజల్యూషన్ స్క్రీన్ తో ఉన్నాయి.ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పలు బ్రాండెడ్ సంస్థ మొబైల్ లకు పోటీగా ఈ మొబైల్ ని ఒప్పో సంస్థ తీసుకురావడం జరిగినట్లు తెలియజేశారు. ఫ్లాగ్ షిప్ హార్డ్వేర్ తో ఈ మొబైల్ ను విడుదల చేయబోతున్నారు ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


ఒప్పో రెనో -8 మొబైల్ స్పెసిఫికేషన్స్ ఫీచర్స్:
ఈ మొబైల్ విషయానికి వస్తే.. ఈ రెనో -8 సిరీస్లో రెండు రకాల హ్యాండ్ సెట్ లను తీసుకువస్తుంది. ఇందులో 8 ఫ్లాగ్ షిప్ హ్యాండ్సెట్ ధర విషయానికి వస్తే రూ.42,000 లోపు ఉండనుంది. ఈ స్మార్ట్ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే 6.43 అంగుళాలు కలదు. ఈ మొబైల్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో పాటు 4,500 MAH బ్యాటరీ సామర్థ్యం కూడా కలదు. ఇక కెమెరా విషయానికి వస్తే 50 MP,2MP,2MP మైక్రో సెన్సార్ కెమెరాలు కలవు. ఈ మొబైల్ యొక్క బరువు 179 గ్రాములు. ఈ మొబైల్ రెండు కలర్లలో లభిస్తుంది. అందులో ఒకటి షిమ్మి రింగు గోల్డ్ మరియు బ్లాక్ కలర్ లో లభిస్తుంది.

PRO -8 విషయానికి వస్తే ఇందులో డిస్ప్లే 4K వీడియోలను కూడా చిత్రీకరించుకోవచ్చు. ఇక గొరిల్లా గ్లాస్ -5 తోపాటు అల్యూమినియం ప్రేమతో డిజైన్ చేయబడింది. ఇక కెమెరా సిస్టంకి సరికొత్తగా ఎక్స్ న్యూరల్ ప్రాసెసింగ్ను తీసుకువస్తున్నారు. దీంతో పగటిపూట అతి తక్కువ కాంతి ఉన్న సరే ఫోటోలను అద్భుతంగా తీయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: