బుల్లిపిట్ట: ఒక్కసారి చార్జింగ్ చేస్తే.. ఐదు సినిమాలు చూడవచ్చు..!!
లెనోవా యాక్సిడెంటల్ డామేజ్ ప్రొడక్షన్ వన్ సొల్యూషన్ కూడా దీనిని కొనుగోలు చేసుకునే సదుపాయాన్ని కూడా అందిస్తోంది. ఇక ఈ మొబైల్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే..12.6 అంగుళాల డిస్ప్లే తో పాటు రిజల్యూషన్ 2500X1600 పిక్సెల్ గా కలదు. HDR 10+ , యాంటీ ఫింగర్ ప్రింట్, డాల్బీ విజన్ వంటి డిస్ప్లే ఫీచర్లతో కలదు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ -5 ప్రొటెక్షన్ కూడా కలదు.870 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పని చేస్తోంది. ఇందులో 8 జిబి ర్యామ్+256 స్టోరేజ్ మెమొరీ కలదు.
ఇక కెమెరా విషయానికి వస్తే 13 మెగా ఫిక్సల్ కాగా వీటితోపాటు 5 మెగా పిక్సల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కూడా కలవు. సెల్ఫీలు వీడియో కాల్ కోసం మందు వైపుగా..8 మెగా పిక్సల్ కెమెరా కలదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ట్యాబ్ పక్క భాగంలో కలదు. బ్యాటరీ విషయానికి వస్తే 10200 MAH సామర్థ్యం కాగా 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉన్నది కంటిన్యూస్గా ఆన్లైన్ వీడియో చూసిన..14.6 గంటల బ్యాటరీ బ్యాకప్ కూడా అందించనుంది. అంటే ఒక్కసారి చార్జింగ్ చేస్తే ఒకేసారి ఐదు సినిమాలు నాన్ స్టాప్ లో చూడవచ్చు. ఇది చాలా సన్నని ట్యాబ్ దీని మందం 0.56 సెంటి మీటర్లు కాగా దీని బరువు..565 గ్రాములు కలదు.