Tata Nexon EV : సూపర్ ఫీచర్స్.. కానీ అన్ని రోజులు ఆగాలి?

ఇక ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో సత్తా చాటుతున్న టాటా మోటార్స్ ఇటీవల మరో కొత్త మోడల్‌ను కూడా రిలీజ్ చేసింది.ఇక టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ (Tata Nexon EV Max) మోడల్‌ను పరిచయం చేసింది. గతంలోనే టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV) మార్కెట్‌లో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ మోడల్‌ను తీసుకొచ్చింది. ఇక హైవోల్టేజ్ జిప్‌ట్రాన్ టెక్నాలజీతో ఈ కొత్త కార్ వచ్చింది.టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ కార్ బుక్ చేసిన తర్వాత డెలివరీ కోసం నాలుగు నెలల దాకా ఆగాల్సిన పరిస్థితి ఉంది. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర వచ్చేసి రూ.17.74 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ XZ+ ఇంకా అలాగే టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ XZ+ లక్స్ ట్రిమ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. అలాగే మూడు కలర్స్‌లో కొనొచ్చు. డేటోనా గ్రే, ప్రిస్టైన్ వైట్ ఇంకా అలాగే ఇంటెన్సీ టీల్ రంగుల్లో లభిస్తుంది.ఇక టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ కార్ ప్రత్యేకతలు గనుక చూస్తే ఇందులో 40.5 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మొత్తం 437 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. లాంగ్ జర్నీ ప్లాన్ చేసుకున్నా కూడా ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు.


అలాగే టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ 250 Nm టార్క్‌తో 105 kW పవర్ డెలివరీ చేస్తుంది. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 9 సెకండ్లలో అందుకుంటుంది.టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ కార్ వేర్వేరు ఛార్జింగ్ ఆప్షన్స్‌తో మనకు అందుబాటులో ఉంది. అలాగే 3.3 కిలోవాట్ లేదా 7.2 కిలోవాట్ ఛార్జర్లు అందుబాటులో ఉంటాయి. 7.2 కిలోవాట్ ఏసీ ఫాస్ట్ ఛార్జర్‌ను ఇంట్లో లేదా ఆఫీసులో కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ ఛార్జర్‌తో ఛార్జింగ్ సమయం వచ్చేసి 6.5 గంటలకు తగ్గుతుంది. ఇక 50 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో 56 నిమిషాల్లో సున్నా నుంచి 80 శాతం దాకా ఛార్జింగ్ చేయొచ్చని కంపెనీ చెబుతోంది.టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ కారులో ఇకో, సిటీ ఇంకా అలాగే స్పోర్ట్ డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. అలాగే ఎనిమిది కొత్త ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇందులో ZConnect 2.0 కార్ టెక్నాలజీ కూడా ఉంది. ZConnect యాప్ ద్వారా 48 కార్ ఫీచర్స్ ని ఆపరేట్ చేయొచ్చు. స్మార్ట్‌వాచ్ ఇంటిగ్రేషన్, ఆటో, మ్యాన్యువల్ డీటీసీ చెక్, ఛార్జింగ్ లిమిట్ ఇంకా అలాగే మంత్లీ వెహికిల్ రిపోర్ట్స్ ఇంకా డ్రైవ్ అనలిటిక్స్ లాంటివన్నీ తెలుసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: