గూగుల్ : వీటి గురించి సెర్చ్ చేస్తే ఇక జైలు శిక్షే!

ఇక ఒక్కోసారి మనకు తెలిసి, తెలియకుండా కొన్ని విషయాల గురించి గూగుల్‌లో వెతకడం స్టార్ట్ చేస్తాం. కొన్ని విషయాలు గురించి సెర్చ్ చెయ్యడం వల్ల జైలుకు వెళ్లే పరిస్థితులు కూడా తలెత్తుతాయి. అందుకే మీరు గూగుల్‌లో ఏ విషయాలను వెతకకూడదో ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలాంటి వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఇక మీరు బాంబును ఎలా తయారు చేయాలి, బాంబును ఎలా అమర్చాలి వంటి విషయాలను గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు మీరు భద్రతా సంస్థల రాడార్‌లోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితిలో మీపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారు. అప్పుడు మీరు జైలుకు కూడా వెళ్లవలసి ఉంటుంది. అందుకే ఉగ్రవాదం లేదా టెర్రర్‌కు సంబంధించిన విషయాలను వెతకడం ఖచ్చితంగా మానుకోవాలి.అలాగే భారత ప్రభుత్వం పోర్న్‌ను నిషేధించింది. ఈ విషయంలో చాలా కఠినంగా కూడా వ్యవహరిస్తోంది. ఇక ఈ పరిస్థితిలో మీరు Googleలో చైల్డ్ పోర్న్‌కు సంబంధించిన ఏదైనా సెర్చ్ చేస్తే మీకు పోస్కో చట్టం 2012లోని సెక్షన్ 14 ప్రకారం 5 నుంచి 7 సంవత్సరాల దాకా జైలు శిక్ష విధించే అవకాశాలు చాలానే ఉన్నాయి. అందుకే చైల్డ్ పోర్న్‌కి సంబంధించిన వాటిని మీరు అస్సలు వెతకకండి.


అలాగే భారతదేశంలో అబార్షన్‌కు సంబంధించి కఠినమైన నిబంధనలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితిలో మీరు గూగుల్‌లో అబార్షన్ పద్ధతుల కోసం సెర్చ్ చేస్తే చాలా నేరమని తెలుసుకోవాలి. దీనికి మీరు జైలు శిక్ష ని కూడా అనుభవించే అవకాశాలు చాలా ఉంటాయి.కాబట్టి అస్సలు సెర్చ్ చెయ్యొద్దు.ప్రస్తుతం చాలా సినిమాలు కూడా ఎన్నో రకాల పైరసీ బారిన పడుతున్నాయి. ఇక ఈ పరిస్థితిలో మీరు గూగుల్‌లో పైరసీ కోసం వెతికితే ఖచ్చితంగా నేరస్థులవుతారు. మీపై చర్య కూడా తీసుకోవచ్చు. ఇక సినిమాటోగ్రఫీ యాక్ట్ 1952 ప్రకారం మీరు సినిమా పైరసీ చేస్తున్నట్లు తేలితే 3 సంవత్సరాల జైలు శిక్ష ఇంకా అలాగే 10 లక్షల జరిమానా కూడా మీరు చెల్లించవలసి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: