వృద్ధ ఎలుకను యవ్వన ఎలుకగా మార్చిన శాస్త్రవేత్తలు!

శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా ముసలి ఎలుకను మళ్ళీ యవ్వనంగా మార్చారు. ఆ యువ ఎలుక సామర్థ్యాలను బాగా అభివృద్ధి చేశారు. దాని మెదడు, ఇంకా కళ్ళు చిన్న ఎలుకలా పనిచేయడం ప్రారంభించాయి. ముసలి ఎలుకలు మళ్ళీ యవ్వనంగా మార్చవచ్చని ఈ ప్రయోగం ద్వారా రుజువైంది. శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం ఎలా చేశారో ఇక ఇప్పుడు తెలుసుకుందాం. బ్రిటీష్ శాస్త్రవేత్తల టీం ఈ ముసలి ఎలుకలను యవ్వనంగా మార్చడానికి దాని మలాన్ని ఉపయోగించింది. ఈ విషయం చాలా షాకింగ్‌గా ఉండవచ్చు, కానీ దాని ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రయోగం కోసం, శాస్త్రవేత్తలు చిన్న ఎలుకల మలాన్ని వృద్ధ ఎలుకలలోకి మార్పిడి చేశారు. ఈ మలం ద్వారా ఎలుకలోకి చేరిన సూక్ష్మజీవులు దాని శరీరానికి మంచి ప్రయోజనం కలిగించాయి. సైన్స్ అలర్ట్ నివేదిక ప్రకారం, మార్పిడి తర్వాత, వృద్ధ ఎలుక ప్రేగులు, కళ్ళు ఇంకా మెదడు చిన్న ఎలుకకు సమానమైన సామర్థ్యాలను కలిగి ఉన్నాయి.ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడిన తర్వాత, శాస్త్రవేత్తలు మరో ప్రయోగాన్ని కూడా చేశారు, అంటే వృద్ధ ఎలుక మలాన్ని మగ ఎలుకలోకి వారు మార్పిడి చేశారు. ఇలా చేయడంతో చిన్న ఎలుకలో ముసలి ఎలుక లక్షణాలు అనేవి కనిపించాయి.


వాటి మెదడులో వాపు కూడా పెరిగింది. ఇది కంటి చూపుకు కారణమని భావించే ప్రొటీన్ లోపం ఉంది. ఈ విధంగా పెరుగుతున్న వయస్సు ప్రభావం వాటిపై కనిపించడం స్టార్ట్ అయ్యింది. ఇక ఒక వ్యక్తికి వృద్ధాప్యం వచ్చినప్పుడు అతని ప్రేగులు అనేవి సరిగ్గా పనిచేయవని శాస్త్రవేత్తలు చెబుతారు.. ఇది ప్రయోగం ద్వారా కూడా బాగా రుజువైంది. పేగు మైక్రోబయోటా, అంటే సూక్ష్మజీవులు ఇంకా వయస్సు సంబంధిత వ్యాధుల పురోగతిపై ప్రభావం చూపుతుంది. ప్రయోగం సమయంలో యువ ఎలుక మల మైక్రోబయోటా వృద్ధ ఎలుకకు మార్పిడి చేయసినప్పుడు మార్పు స్పష్టంగా కనిపించింది.ఇక ప్రస్తుతానికి ఎలుకలపైనే ఈ ప్రయోగం చేశామని, అయితే మానవ జీవితంలో పేగు మైక్రోబయోటాకు చాలా ముఖ్యమైన పాత్ర కూడా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.ప్రేగులలో ప్రయోజనం కలిగించే సూక్ష్మజీవులు అనేవి కూడా ఉండటం వల్ల శరీరం సరైన రీతిలో పనిచేయడానికి సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

RAT

సంబంధిత వార్తలు: