బుల్లి పిట్ట: వన్ ప్లస్ నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ ఇవే..!!

Divya
నార్డ్ సిరీస్లో మరో సరికొత్త మోడల్ ఫైవ్ జి స్మార్ట్ ఫోన్ లో ప్రస్తుతం వన్ ప్లస్ యూరప్లో ఆవిష్కరించడం జరిగింది. మిడ్ రేంజ్ సెగ్మెంట్లో తీసుకువచ్చిన ఈ సరికొత్త మొబైల్ తో 2టీలో మీడియా టెక్ ప్రాసెసర్, అమోలెడ్ డిస్ ప్లే తో పాటు ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లు కూడా చాలా సరికొత్తగా ఉన్నాయి. ఇటీవల భారత మార్కెట్లో విడుదలైన వన్ ప్లస్ 10 ఆర్ , వన్ ప్లస్ నార్డ్ CE 2 లైట్ , తరువాత దీనిని యూరఫ్ లో ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ స్మార్ట్ఫోన్ సింగిల్ వేరియంట్ తో మార్కెట్లో విడుదల అయ్యింది. 8GB ర్యామ్ తో 128 GB స్టోరేజ్ తో 399 యూరోలు ధర పలుకుతోంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారుగా 32,100 రూపాయలు గా ఈ స్మార్ట్ మొబైల్ ఫోన్ ధర నిర్ణయించారు.
ఇక గ్రీన్ బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. నార్డ్ 2Tస్మార్ట్ ఫోన్ ప్రస్తుతానికి యూరప్లో లో విడుదల అయింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు విడుదల చేస్తారు.. ఇండియాలో మరి ఎప్పుడు విడుదల చేస్తారు అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత 12.1 ఆపరేటింగ్ సిస్టమ్ తో స్మార్ట్ఫోన్ పనిచేస్తుంది. ఇక 90 హెడ్జెస్ రిఫ్రెష్ రేటుతో 6.43 అంగుళాల పొడవు కూడా మనకు లభిస్తుంది.  ఈ స్మార్ట్ ఫోన్ లో మొత్తం నాలుగు కెమెరాలు ఉన్నాయి. వెనక భాగంలో మూడు ఉండగా ముందు భాగంలో 1కెమెరా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

బ్యాక్ కెమెరా 50 ఎంపీ sony imx766 సెన్సార్ తో వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ కూడా అమర్చబడింది రెండు కెమెరా లలో ఒక దాంట్లో 8 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ ఉండగా మరొక కెమెరాలు 2ఎంపీ మోనోక్రోమ్ సెన్సార్ కూడా ఉన్నాయి. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో పనిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: