షర్ట్ లోపల పెట్టుకునే ఏసీ.. బాడీ అంతా సో కూల్!

స్ప్లిట్ ఇంకా విండో ACలతో పాటు మీరు పోర్టబుల్ AC అని కూడా వినే ఉంటారు. అయితే వేరబుల్ ఏసీ అనే పేరు ఎప్పుడైన విన్నారా? సోనీ కంపెనీ చాలా కాలం క్రితమే ధరించగలిగే ఏసీని రిలీజ్ చేసింది.సోనీ గత సంవత్సరం Reon Pocket 2ని విడుదల చేసింది. ఈ ధరించగలిగే AC 2019 వ సంవత్సరంలో ఆవిష్కృతమైన Reon Pocket కి తదుపరి వెర్షన్. ఇందులో ఎన్నో మెరుగైన ఫీచర్లు ఉన్నాయి. కంపెనీ దీనిని ధరించగలిగే థర్మో పరికరం అని కూడా పేర్కొంది. Reon Pocket 2 వేడిని ఇంకా చల్లదనాన్ని కూడా అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా కూడా దీన్ని ఈజీగా నియంత్రించవచ్చు.ఇతర పోర్టబుల్ AC పరికరాలతో దీనిని పోల్చవలసి వస్తే సోనీ దాని ఎండోథర్మిక్ పనితీరు అనేది చాలా రెట్టింపు అని పేర్కొంది. sony Reon Pocket 2ను మీ శరీరానికి ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు. దానిని మీ జీవనశైలి అవసరాలకు అనుగుణంగా కూడా ఉపయోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఇక సోనీ స్టెయిన్‌లెస్ స్టీల్ కాంటాక్ట్ ప్యాడ్‌ని అందించింది, ఇది మీ శరీరం నుండి వేడిని కూడా ఆకర్షిస్తుంది. ఇది బహిరంగ కార్యకలాపాల సమయంలో కూడా ఉపయోగించవచ్చు.


Sony Reon Pocket 2 USB-C ద్వారా కూడా ఛార్జ్ చేయవచ్చు. ఇది వెచ్చని ఇంకా చల్లని మోడ్‌లను కలిగి ఉంటుంది. ఈ కారణంగా మీరు దీనిని సంవత్సరం పొడవునా కూడా ఉపయోగించవచ్చు.స్మార్ట్‌ఫోన్ ద్వారా దాని స్థాయిని 1 నుండి 4 మధ్య సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక ఒక్కసారి ఛార్జ్ చేసిన తర్వాత ఈ పరికరం 20 గంటల పాటు కూల్ మోడ్‌లో పని చేస్తుంది. లెవెల్ 4లో మూడు గంటల పాటు దీనిని ఉపయోగించవచ్చని సోనీ కంపెనీ పేర్కొంది. అలాంటి స్థాయిని హీట్ మోడ్‌లో కూడా మీరు సెట్ చేయవచ్చు. జపాన్‌లో దీని ధర  వచ్చేసి JPY 14,850 (సుమారు రూ. 9,000) వద్ద ఉంది. ఇది ఇండియన్ మార్కెట్లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై కంపెనీ ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: