Realme GT Neo 3 : లాంచ్ ఇంకా పూర్తి వివరాలు!

ఫేమస్ చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ రియల్ మి నుంచి GT Neo సిరీస్ కొత్త ఫోన్ వస్తోంది. ఏప్రిల్ 29 వ తేదీన భారత మార్కెట్లోకి Realme GT Neo 3 లాంచ్ కాబోతోంది.ఇక ఈ కొత్త రియల్ మి GT Neo 3 స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీని ప్రకటించడం జరిగింది. కొన్ని రోజుల క్రితమే చైనాలోని 150W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో Realme GT Neo 3 కంపెనీ ఫస్ట్ ఫోన్‌గా లాంచ్ అయింది.ఇక ఈ కొత్త GT Neo 3 చైనాలో రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. హై 150W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో ఈ ఫోన్ రానుంది. దాదాపు 20 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ అవుతుందని కంపెనీ తెలిపింది. తక్కువ లేదా బేస్ వెర్షన్‌లో 80W ఛార్జింగ్ సపోర్టుని ఇది అందిస్తోంది. అలాగే 30 నిమిషాలలోపు బ్యాటరీని కూడా ఫుల్ చేసేస్తుందని కంపెనీ తెలిపింది. ఆసక్తికరంగా, రాబోయే OnePlus 10Rలో ఇదే ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ లు ఉన్నాయని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. GT నియో 3 అనేది రీబ్రాండెడ్ వెర్షన్ అంటోంది కంపెనీ.ఇక Realme GT Neo 3 ఇండియన్ మార్కెట్లో ఎంత ఉంటుంది అనేది కంపెనీ రివీల్ చేయలేదు. ఎందుకంటే లాంచ్‌కు ముందే Realme ధర గురించి వివరాలను ఇంకా అసలు వెల్లడించలేదు. 


ఇక ఈ ఫోన్ చైనీస్ ధరలను బట్టి మన దేశ మార్కెట్లో ఎంత ఉంటుంది అనేది అంచనా వేస్తున్నారు మార్కెట్ నిపుణులు .. Realme GT Neo 3 80W వెర్షన్ స్టార్టింగ్ ధర (CNY 1,999) 150W వెర్షన్ CNY 2,699 నుంచి అందుబాటులో ఉన్నాయి. మన దేశీయ ధరలు వరుసగా రూ.24,000 నుంచి రూ.33,000లకు సమానమని అంచనా.అలాగే స్పెషిఫికేషన్ల విషయానికి వస్తే..ఇక Realme GT Neo 3 ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ ఫీచర్‌లతో వచ్చింది. 6.7-ఇంచెస్ 2K డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 1000Hz టచ్ శాంప్లింగ్ రేట్ HDR10+ సపోర్ట్‌తో ఈ ఫోన్ వస్తోంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ రానుంది. మాక్సిమం 12GB ram ఇంకా అలాగే 256GB ఇంటర్నల్ స్టోరేజీతో వచ్చింది.అలాగే ఈ Realme GT Neo 3 Realme UI 3.0తో రానుంది. చైనాలో Android 12కి బదులుగా ఇది Android 11తో వచ్చింది. ఇక అలాగే ఇండియన్ మార్కెట్లో GT Neo 3లో Android 12తో వచ్చే ఛాన్స్ కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: