బుల్లిపిట్ట: ఐఫోన్ మొబైల్స్ మొదటిసారిగా ఇండియా లోని తయారీ..!!

Divya
ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో తయారయ్యే మొబైల్స్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని చెప్పవచ్చు. ఇక బిజినెస్ పరంగా కూడా మంచి మార్కెట్ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఇప్పుడు ఎక్కువగా ప్రముఖ మొబైల్ సంస్థలు భారత్లోనే దృష్టి పెడుతున్నాయి. భారత్ వేదికగా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలని అడుగులు వేస్తున్నాయి ఎన్నో సంస్థలు. అలాంటి వాటిలో దిగ్గజ మొబైల్ తయారీ సంస్థ ఆపిల్ కూడా ఒకటి. భారత్లో కొత్త మొబైల్ లను తయారు చేసే ఒక ప్లాంటును ఏర్పాటు చేస్తోంది ఈ సంస్థ.
ప్రధాన మోడీ మేకప్ ఇన్ ఇండియా భాగంలో ఈ మొబైల్స్ ను తయారు చేస్తున్నట్లుగా చెన్నైలో సమాచారం. ముందుగా ఫైల్ కోసం ఐఫోన్ -13 ను తయారు చేయబోతున్నట్లు కంపెనీ సంస్థ తెలియజేసింది. చెన్నై సమీపంలో ఫాక్స్ కాన్ ప్లాంట్ లో ట్రైయల్ ను ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం. దేశీయ మార్కెట్లోనూ విదేశీ ఉత్పత్తుల కోసం ఐఫోన్ సంస్థ ఐఫోన్-13 ను ప్రారంభించినట్లు తెలియజేసింది. ఇక వీరితో పాటుగా ఐఫోన్ సెమీ కండక్టర్ చిప్ ల  సరఫరా ను కూడా ప్రారంభించింది. రాబోయే రోజులలో అన్ని ఐఫోన్ మొబైల్స్ లో ఇక్కడ కూడా సరఫరా చేసే అవకాశం ఉండబోతోంది అని తెలియజేసింది.
ఇక ఐఫోన్-13 లేటెస్ట్ గా తయారు చేయడంతో బాగా అమ్ముడు పోయాయని తెలియజేసింది. ఐఫోన్ -13 ప్రో, ఐఫోన్-13 ప్రో మాక్స్ మొబైల్ ను తయారు చేసేందుకు కంపెనీ ఇంకా సిద్ధంగా లేదట. ఆపిల్ ఇప్పటివరకు చెన్నై ఫాక్స్ కాన్ ప్లాంట్లు ఐఫోన్-11,12 మోడల్ గల మొబైళ్లను మాత్రమే ఉత్పత్తి చేసింది. ఇక బెంగళూరులో ఐఫోన్-SE మొబైల్ ను ఉత్పత్తి చేసింది. భారతదేశంలో ఉపయోగించే ఆపిల్ ఫోన్స్ దాదాపుగా 70 శాతం వరకు  మన దేశంలోనే ఉత్పత్తి చేసే అవకాశం ఉందట. ప్రస్తుతం చెన్నైలో శ్రీ పెరంబదూర్ లో ఆపిల్ అన్ని మొబైల్స్ ను తయారు చేస్తున్నది. తాజాగా భారత్లో ఐఫోన్-13 ని ప్రారంభించినట్లు ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ విషయాన్ని గత ఏడాది సెప్టెంబర్ లోనే ప్రకటించారు. ఇక అంతే కాకుండా ఈ మొబైల్ లో వాల్యూమ్  ఇంక్రీజ్ ను కూడా చేయబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: