బుల్లిపిట్ట: హీరో కంపెనీ నుండి ఎలక్ట్రిక్ బైక్.. ధర మరియు ఫీచర్లు ఇవే..!!
ఈ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ ధర రూ.72,000 రూపాయలుగా వెల్లడించ బడింది. ఇక అంతే కాకుండా ఇందులో ఎల్లో, లైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో మనకి ఈ బైకు లభిస్తుంది. అంతేకాకుండా ఈ బైక్ ఉన్న అధికారిక వెబ్సైట్లో ఎక్కడేక్కడ లభిస్తుందో ఆయా ప్రాంతాలకు సంబంధించి జాబితాను కూడా తెలియజేస్తోంది.
ఇక ఈ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్ విషయానికి వస్తే.. ఈ ఎలక్ట్రిక్ బైక్ ను ఏ విధంగా మనం రిజిస్ట్రేషన్, లైసెన్స్ అవసరం లేకుండానే నడుపుకోవచ్చు.. ఇక అంతే కాకుండా 25 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ఈ బైకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలియజేసింది. హీరో ఎలక్ట్రిక్ యొక్క అధికారిక వెబ్సైట్ అందించిన సమాచారం ప్రకారం.. ఈ బైక్ ను ఒకసారి ఛార్జింగ్ చేసినట్లు అయితే..8500 కిలోమీటర్ల వరకు దూరం ప్రయాణించగలదని అధికారికంగా ఆ వెబ్ సైట్ లో తెలపడం జరిగింది. ఇక ఈ బైక్ లో హెడ్ ల్యాంప్, రివర్స్ మోడ్ వంటి ఫీచర్లను కూడా ఫీచర్లను కూడా అందిస్తోంది. అందుచేతనే ఈ బైక్ లోకల్ లో ఎవరైతే ఎక్కువగా తిరుగుతూ ఉంటారో.. వారికి ఈ బైక్ బాగా సరిపోతుందని చెప్పవచ్చు.