బుల్లిపిట్ట:ఈ కార్ల కు గట్టి పోటీ..ఫస్ట్ డే కొన్ని వేలకు పైగా బుకింగ్స్..!!

Divya
ప్రముఖ బ్రాండ్ కలిగిన కియా సంస్థ నుంచి జనవరి 14 వ తేదీన సరికొత్త కార్ ప్రీ బుకింగ్ ను ప్రారంభించింది.. అలా మొదటి రోజే 7 వేలకు పైగా బుకింగ్స్ ను సాధించింది. కియా నుంచి కారెన్స్ ప్రీమియం క్లాస్ గల..MPV కార్లను రూపొందించడం జరిగింది.ఈ కారు కోసం పాతిక వేల రూపాయలు చెల్లించి బుక్ చేసుకోవచ్చట.. కియా తన గ్లోబుల్ లాంచ్ సందర్భంగా ఇండియాలో ఉండే.. ఈ కార్లను విడుదల చేసింది.. ఇండియాలో ఇది నాలుగవ సరికొత్త కారు. ఇదివరకే కియా నుంచి సెల్టోస్, కియా సోనెట్, కియా కార్నివాల్ వంటి రకాలను మార్కెట్లోకి విడుదల చేసింది.. ఇప్పుడు తాజాగా కియా కారెన్స్ అనే సరికొత్త కారు ని విడుదల చేసింది.. వీటి ఫ్యూచర్స్ విషయానికి వస్తే..ఎంతో అద్భుతంగా ఉన్నట్లు సమాచారం.. అయితే దీని అసలు ధరను మాత్రం ప్రకటించలేదు.ఈ కారు మారుతి సుజుకి XL వంటి కార్ కి గట్టి పోటీ గా ఉండనుంది.ఈ కారు మొత్తం ఐదు వేరియంట్లలో లభిస్తుంది.
ఇక కియా కారెన్స్ ఫీచర్ల విషయానికి వస్థే.. ఈ కారు వినియోగించుకునే వారికి..10.25 అంగుళాల తో టచ్ డిస్ప్లే కలదు. ఇది టచ్ స్క్రీన్ నావిగేషన్ సిస్టమ్ తో వర్క్ చేస్తుంది. కారు లోపల స్వచ్ఛమైన ఎయిర్ ప్యూరిఫైయర్ ని అందించే విధంగా దీన్ని తయారు చేయబడింది. ఇందులో బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించలేదట.. అందుకోసం ఇందులో రెండు ఎలక్ట్రిక్ టంబుల్ ను ఏర్పాటు చేశారు. ఇక దీనిని పెట్రోల్, గ్యాస్, డీజిల్ వంటి మూడు వేరియంట్ లలో అందుబాటులో ఉండనుంది. ఇక అంతే కాకుండా 7 సీట్లు లేదా 6 సీట్ల ఆప్షన్ ను కూడా మనకి అందుబాటులో ఉండేలా చేశారు.
కియా కార్ల తో పోటీ పడేందుకు హుందాయ్, మారుతి ఎక్స్ ఎల్ -6, టయోటా క్రిస్టా వంటి ఇతర బ్రాండ్ లు  ఈ కారు తో పోటీ పడనున్నాయి. అయితే వీటన్నిటికంటే ఎక్కువగా ఇన్నోవా MPV కార్లు అమ్ముడు పోతున్నాయి. ఈ కారు ను 2005వ సంవత్సరంలో ప్రారంభించబడింది.అప్పటి నుంచి సరికొత్త అప్డేట్ లతో మన ముందుకి వస్తూనే ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: