తల్లిపాలతో జ్యువెలరీ.. ఎలా చేస్తారో తెలుసా..!

MOHAN BABU
చెన్నైకి చెందిన ఆర్టిస్ట్ ప్రీతి విజయ్ కి చిన్నప్పటి నుంచి ఆర్ట్,క్రాఫ్ట్ వర్క్ అంటే చాలా ఇష్టం. డిగ్రీ చదివిన తర్వాత పాలిమర్,మట్టి కలిపి తయారు చేసిన బొమ్మలు అమ్మడం మొదలు పెట్టింది. తల్లిపాలతో  చేసిన జ్యువెలరీ కావాలని కొందరు తల్లులు ఆమెను అడిగేవాళ్లు. దాంతో అప్పటి నుంచి మొమ్మాస్ మిల్కీ లవ్ పేరుతో రకరకాల డిజైన్లలో ఉన్న ఉంగరాలు, చెవి కమ్మలు, పెండెంట్స్ అమ్ముతోంది ప్రీతి. డిజైన్స్,మెటీరియల్ ని బట్టి వీటి ధర వెయ్యి నుంచి 4 వేల లోపు ఉంటుంది. అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో ఉంటున్న 25 ఏళ్ల సారా కాస్టి ల్లో ఇన్ స్టాగ్రామ్ లో తల్లి పాలతో చేసిన నగల్ని చూసింది.

 తనకి కూడా బ్రెస్ట్ మిల్క్ జువెలరీ బిజినెస్ లోకి రావాలనిపించింది అప్పటికే ఆమెకు ఏడాది వయసున్న పాప ఉంది. దాంతో మొదట్లో తన పాలతోనే ఎక్స్ పెరిమెంట్స్ చేసేది. ఈ ఏడాదిలో మార్చిలో కీప్ సేక్ బై గ్రేస్ అనే కంపెనీ పెట్టి తల్లి పాలతో చేసిన ఉంగరాలు, పెండెంట్ లు అమ్మడం మొదలు పెట్టింది సారా. సైజును బట్టి ఒక్కో పెండెంట్ ధర 60 నుంచి 150 డాలర్లు. జువెలరీలు అంటే చాలా మందికి సెంటిమెంట్.

అయితే తల్లి పాలతో చేసిన జువెలరీలు మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే ఇవి మాతృత్వపు గుర్తులుగా నిలిచిపోతాయి. మా క్లయింట్ లలో చాలా మంది పిల్లలు పాలు తాగడం మానేసి, సాలిడ్ ఫుడ్  తింటున్నా టైంలో తమ పాలను పంపిస్తారని సారా చెబుతోంది. తమ ఆఖరి పాల బొట్టుని అందమైన జ్ఞాపకంగా మాలుచుకోవాలనే తపన వాళ్ళకి ఉంటుందని సారా చెబుతోంది. అయితే వాటిని ఎలా చేస్తారంటే.. తల్లి పాలను ఎండలో ఉంచి వాటిని బాగా ఇగుర్చుతారు. దాంతో పాలు పిండిలా మారతాయి.ఆ పిండిలో రేసిన్ అనే జిగురు పదార్థాన్ని కలిపి,రాయిగా మారుస్తారు. తర్వాత కస్టమర్లు కోరిన డిజైన్ లో పెండెంట్లు, రింగ్స్ తయారు చేసే అందిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: