అలెర్ట్ : పొరపాటున ఈ పని చేసినా వాట్సాప్ చాట్ మొత్తం లీక్ !

Vimalatha
గత కొన్నేళ్లుగా వాట్సాప్ చాట్ లీక్‌కు సంబంధించిన అనేక కేసులు తెరపైకి వస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో వినియోగదారుల డేటా, గోప్యతకు సంబంధించిన అనేక ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులు వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. మీరు కూడా వాట్సాప్ ఉపయోగిస్తే జాగ్రత్తగా ఉండాలి. నేడు సైబర్ మోసం, హ్యాకింగ్ వేగంగా పెరుగుతోంది. కాబట్టి మీ ప్రైవేట్ వాట్సాప్ చాట్ లీక్ అయ్యే అవకాశం ఉంది. ఈ రోజు మనం దాని గురించి తెలుసుకుందాం. కొన్ని పొరపాట్లని పొరపాటున చేసినా మీ చాట్ మొత్తం లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వాట్సాప్ ఖాతాలో ఎప్పటికీ మరచిపోకూడని కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీ వాట్సాప్ చాట్‌లు ఎప్పటికీ సురక్షితంగా ఉండాలని మీరు కోరుకుంటే చాట్‌లను క్లౌడ్ google డిస్క్‌కి బ్యాకప్ చేయకూడదు. అలా చేయడం వల్ల అది లీక్ అయ్యే అవకాశాలు బాగా పెరుగుతాయి.
హ్యాకర్లు తరచుగా ఫిషింగ్ లింక్‌లు, ఇతర మార్గాల ద్వారా మీ Gmail లేదా iCloud ను హ్యాక్ చేయాలనుకుంటారు. వారు మీ Gmail లేదా iCloudకి యాక్సెస్ పొందితే... హ్యాకర్లు మీ డ్రైవ్‌లో నిల్వ చేసిన whatsapp చాట్‌లను సులభంగా యాక్సెస్ చేయగలరు. అలాంటప్పుడు హ్యాకర్ మీ ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు, చాట్‌లను ఈజీగా యాక్సెస్ చేస్తారు. దీని ద్వారా మిమ్మల్ని బ్లాక్‌ మెయిల్ చేయవచ్చు. కాబట్టి దాదాపుగా మీ డేటాను బ్యాకప్ చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. అదే సమయంలో ఇంటర్నెట్‌ లో సర్ఫింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడూ సురక్షితమైన బ్రౌజింగ్ చేయండి. అనవసరమైన లింక్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయొద్దు. నేటి డిజిటల్ యుగంలో అడుగడుగునా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి వాట్సాప్ ను ఉపయోగిస్తున్న వాళ్లంతా జాగ్రత్తగా ఉండడం మంచిది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందే జాగ్రత్తగా ఉండడం మంచిది కదా !

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: