ఐవీఎఫ్ పద్ధతితో సైంటిస్ట్ లు ఏం సృష్టించారో తెలిస్తే షాక్.. అవుతారు..!

MOHAN BABU
సముద్రపు లోతుల్లో దాగుండే పగడపు దీవుల గురించి వినే ఉంటారు. ప్రకృతి సిద్ధంగా ఏర్పడే ఈ పగడపు దీవులను టెక్నాలజీ సాయంతో పెంచేందుకు పరిశోధకులు గత కొంత కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలో ఆరోగ్యకరమైన రీఫ్స్ నుంచి కోరల్ ఎగ్స్, స్పాన్ గా పిలవబడే స్పెర్ము ను సేకరించి రీఫ్ పై ప్రత్యేకంగా డిజైన్ చేసిన ప్రవహిత నీటి గుంటల్లో మిలియన్ సంఖ్యలో బేబీ కొరల్స్ ను పెంచారు. మైక్రోస్కోపిక్ లార్వా నుంచి అభివృద్ధి చెందిన ఫస్ట్ బ్యాచ్ కోరల్ IVF బేబీస్ ను 2016లో నాటగా.. అవి మొదటిసారి విజయవంతంగా పునరుత్పత్తి చేయబడ్డాయి. కాగా దెబ్బతిన్న దీవులను ఈ సాంకేతికత విజయవంతంగా పునరుద్ధరించగలదనే సంకేతాలను ఇచ్చింది. కర్బన ఉద్గారాల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పగడపు దీవులు ముప్పును ఎదుర్కొంటున్నాయి.

ఈ నేపథ్యంలో బేబీ కోరల్స్ ను పెంచడంతో పాటు పాడైన వాటిని పునరుద్ధరించేందుకు వరల్డ్ లీడింగ్ టెక్నిక్ కోరల్ IVF ను ఉపయోగిస్తున్నారు. కాగా మొదటి కోరల్ IVF అధ్యయనం సమయంలో హెరాన్  ఐలాండ్ సమీపాన గ్రేట్ బారియర్ రీఫ్ పై ఏర్పడిన 22 భారీ పగడపు కాలనీలను పరిశోధకులు మళ్ళీ సందర్శించారు. అవి బ్లీచింగ్ ఎపిసోడ్ ను తట్టుకొని పరిపక్వతకు చేరుకున్నాయని గుర్తించారు. ఇది ప్రోత్సాహకరమైన పరిణామంగా భావిస్తున్న రీసెర్చర్స్.. మొత్తానికి ఈ ఏడాది పగడాలు మొలకెత్తే సీజన్ లో తమ మొదటి బ్యాచ్ పగడపు లార్వా లేదా బేబీ కోరల్స్ ను ఉత్పత్తి చేశారు. ఈ అద్భుతమైన పద్ధతిని ఉపయోగించి గ్రేట్ బారియర్ రీఫ్ లో బ్రీడింగ్ కాలనీని స్థాపించడం ఇదే మొదటిసారి.

ఈ కోరల్ బేబీస్ మైక్రోస్కోపిక్ లార్వా నుంచి డిన్నర్ ప్లేట్ల పరిమాణానికి పెరిగాయని, బ్లీచింగ్ ఈవెంట్ ను  తట్టుకొని నిలబడటమే కాకుండా ఇప్పుడు తమను తాము పునరుత్పత్తి చేసుకోగలవని గ్రేట్ బారియర్ రీఫ్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అన్నా మార్స్ డెన్ తెలిపారు. అంతేకాదు దెబ్బతిన్న రీఫ్ ను పునరుద్ధరించగల లార్వా ను  ఉత్పత్తి చేయడంలోనూ సహాయపడతాయని వెల్లడించారు. కాగా 1995 నుంచి గ్రేట్ బారియర్ రీఫ్ దాని పగడాల్లో సగానికిపైగా కోల్పోయిందని 2020 అధ్యయనం సూచించింది. అధిక సంఖ్యలో అడల్ట్ కోరల్స్ చనిపోవడం వల్ల యంగ్ కోరల్స్ సంఖ్య పడిపోయిందని మునుపటి ఏడాది పరిశోధనలో కనుగొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: