బుల్లిపిట్ట: ఫాస్ట్ ట్యాగ్ ఉపయోగిస్తున్నారా..ఈ విషయం తెలుసుకోండి..?

Divya
భారతదేశంలో ఇప్పటి వరకు ఎవరైతే ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వుంటారో అందుకు మాత్రమే వాహనాలపై చలానా వేస్తూ వస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఫాస్ట్ ట్యాగ్ కి రీచార్జ్ చేయకపోయినా సరే వాహనానికి చలానా వేసే అవకాశం ఉంటుందట.. ఇక కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏమిటంటే దేశవ్యాప్తంగా ఉన్న టోల్ బ్లాక్లను తొలగించే ప్రణాళిక పై ఈ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం కదిలే వాహనాలకు మాత్రమే టోల్ వసూలు చేయడం జరుగుతుంది.
ఎన్ హెచ్ ఏ ఐ తో రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఏకమై ఇలాంటి నిర్ణయం తీసుకుందట. ముఖ్యంగా ఈ కొత్త పథకం ద్వారా వాహనం యొక్క ఫాస్ట్ ట్యాగ్ లేకుండా ఎవరైనా సరే రుసుము చెల్లించకుండా ప్రయాణిస్తే తప్పకుండా దానిపై చలానా విధించబడుతుంది. అంతేకాదు ఆ వాహనానికి ఎక్కువసార్లు చలానా విధించినా కూడా ఆర్ సి బ్లాక్ చేస్తామని హెచ్చరిస్తున్నారు . ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని ప్రస్తుతం ఆలోచిస్తున్నట్లు భవిష్యత్తులో తప్పకుండా దీనిని అమలు చేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.

ముఖ్యంగా ఈ పథకం అమలులోకి వస్తే కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపితే ముందుగా ఢిల్లీ - మీరట్ ఎక్స్ప్రెస్ వే లో ఈ వ్యవస్థను అమలు చేస్తారు. అంతేకాదు ఈ ఎక్స్ప్రెస్ వేలో ఇప్పటికే నంబర్ ప్లేట్ రీడర్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆలోచనలో ఉంది.. త్వరలోనే పూర్తిస్థాయిలో అమలు చేస్తామని ప్రకటించారు. ఇక టోల్ పాయింట్ల వద్ద ఏర్పాటు చేసిన అల్ట్రా ఆధునిక కెమెరాల సహాయంతో వాహనం యొక్క నంబర్ ప్లేట్.. ఫాస్ట్ ట్యాగ్  ద్వారా దూరాన్ని బట్టి ఆటోమేటిక్ గా టోల్ డబ్బులు వసూలు చేస్తారు. అంతే కాదు ఫాస్ట్ ట్యాగ్ లేకుండా వాహనం గనుక వెళ్ళినట్లయితే దానిని ఫుటేజ్ సీసీ కెమెరాలో బంధిస్తారు. ఇక ఈ ఫుటేజ్ ఆధారంగా యజమానికి మొబైల్ ఫోన్ ద్వారా సమాచారం అందుతుంది. కాబట్టి తప్పని సరిగా ఈ ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ చేసుకోవాలి. ఈ సరికొత్త నియమాలు త్వరలోనే అమలు చేస్తారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: