బుల్లి పిట్ట: బిస్లరీ నుంచి న్యూ మొబైల్ యాప్..బెనిఫిట్స్ ఇవే..?

Divya
బిస్లరీ.. ప్యాకేజ్డ్ వాటర్ బ్రాండ్.. పరిశుభ్రమైన తాగునీటిని ప్యాకెట్లలో, డబ్బాలలో ఫిల్ చేసి విక్రయిస్తూ పాపులర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంటోంది బిస్లరీ. తాజాగా తమ కార్యకలాపాలను మరింత విస్తరింపజేసేందుకు సరికొత్త సేవలకు శ్రీకారం చుడుతోంది.. ఇకపోతే ప్రస్తుతం ఇంటర్నేషనల్ డైరెక్ట్ టు కన్జ్యూమర్ కాన్సెప్టును ప్రోత్సహిస్తూ బిస్లరీ అనే మొబైల్ అప్లికేషన్ ను తాజాగా లాంచ్ చేసింది.

ఈ మొబైల్ యాప్ సహాయంతో వినియోగదారులు ఏకంగా ప్యాకేజ్డ్ వాటర్ ను బుకింగ్ చేసుకొని డోర్ స్టెప్ పొందవచ్చు. అంతేకాదు ఈ యాప్ సహాయంతో ఎవరైతే బిస్లరీ వాటర్ బుక్ చేసుకుంటారో..వారికి కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే నేరుగా డోర్ స్టెప్ విధానంలో వాటర్ క్యాన్లను ఇంటికి డెలివరీ చేస్తారు. ఈ యాప్ ను ఐఓఎస్ , ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. ఇప్పటికీ పలు మొబైల్ నగరాలలో బిస్లరీ వాటర్ డోర్ డెలివరీ సేవలను ప్రారంభించి.. కస్టమర్లకు మరింత సులభతరం చేసింది.
బాగా పాపులారిటీ తెచ్చుకొని మహానగరాలుగా గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్ , గురుగ్రాం, బెంగళూరు, అహ్మదాబాద్ , చెన్నై తదితర ప్రాంతాలలో తమ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎవరైతే ఈ యాప్ ద్వారా వాటర్ క్యాన్ బుక్ చేసుకుంటారో వారికి కేవలం 24 గంటల లోపు ఇంటివద్దకి డెలివరీ చేస్తామని బిస్లరీ ఒక అధికారిక ప్రకటన కూడా చేసింది. లాక్ డౌన్ సమయంలో ఆన్లైన్ బుకింగ్ కు ఆదరణ బాగా పెరిగింది. ఈ సమయంలో చాలామంది బయటకు వెళ్ళలేక నిత్యవసర సరుకులు, ఫుడ్ ఐటమ్స్ ను బాగా బుక్ చేసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించారు.

నిజానికి కరోనా భయంతో బయటకు వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్న వారికి ఇలా డోర్ స్టెప్ డెలివరీ చేయడం వల్ల అందరికీ ప్రయోజనకరంగా మారింది.. ఆన్లైన్ బుకింగ్ పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా బిస్లరీ కూడా ఇలాంటి డోర్ డెలివరీ సేవలను ప్రారంభించాలని లాక్ డౌన్ సమయంలోనే నిర్ణయించుకుంది. అయితే తాజాగా అన్ని ఉత్పత్తులను యాక్సెస్ చేయడానికి సరికొత్త  ప్లాట్ఫారం ను ప్రకటించింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: