కొత్త మాస్కులు.. కరోనాను కనిపెడుతాయంటా..!
దీంతో మార్కెట్‌లోకి అనేక రకాల డిజైన్లతో మాస్కులు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు తాజా టెక్నాలజీని పొందిపరిచిన మాస్కులు వస్తున్నాయి. అందులో భాగంగా ఏకంగా కరోనా వైరస్‌ను నిర్ధారించే మాస్కులు కూడా వస్తున్నాయంట. తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు ఉన్నవారు సహజంగానే కరోనా పరీక్షలు చేయించుకుంటారు. కరోనాను గుర్తించాలంటే ర్యాపిడ్, ఆర్‌టీపీసీఆర్ వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అయితే, ప్రతిసారి టెస్టుల కోసం చాలా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. ఇప్పుడు.. విదేశి ప్రయాణాలకు, కొన్ని సంస్థల్లో పనిచేయడానికి లేదా ఇతర అవసరాలకు కొవిడ్ టెస్ట్ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.
అయితే, ప్రతిసారి కొవిడ్ పరీక్షలు చేయకుండా.. మాస్క్ తో కరోనాను గుర్తించేలా పరిశోధనలు చేశారు ఓ శాస్త్రవేత్తల బృందం. జపాన్ కు చెందిన సైంటిస్టులు ఈరకం మాస్కును సిద్ధం చేశారు. క్యోటో ప్రీ పెక్చువల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం దీనిపై పరిశోధనలు జరిపారు. తొలుత కరోనా నుంచి తప్పించుకోవడానికి మాస్కు తయారు చేశారట.. తరువాత కరోనాను గుర్తించేలా మాస్కును అభివృద్ధి చేశారు. ఈ మాస్క్ ద్వారా కరోనా సోకిన వ్యక్తిని అస్పత్రికి తీసుకు వెళ్లకుండానే కరోనాను గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు.