అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ వచ్చే వారం నుంచి మరింత ఖరీదు !

Vimalatha
అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ వచ్చే వారం నుంచి మరింత ఖరీదు కానుంది. విశేషమేమిటంటే డిసెంబర్ 13 నుంచి ఈ మార్పులు జరగనున్నాయి. కాబట్టి పాత ధరకే ప్రైమ్ మెంబర్‌షిప్ పొందడానికి యూజర్స్ కు కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ వార్షిక, నెలవారీ , త్రైమాసిక ప్లాన్‌ల ధరను మార్చింది. ఈ వార్తను అమెజాన్ తన అధికారిక వెబ్‌సైట్‌లో ధృవీకరించింది.
అమెజాన్ ప్రైమ్ సవరించిన ప్లాన్‌ల విషయానికొస్తే... సవరించిన ధరలు అమలు చేసిన తర్వాత వార్షిక ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ రూ. 1499కి అందుబాటులో ఉంటుంది. ఇది పాత ధర రూ. 999 కంటే దాదాపు రూ. 500 ఖరీదైనది. నెలవారీ ప్లాన్ ల విషయానికి వస్తే... డిసెంబర్ 13 నుండి ప్రైమ్ సభ్యులు రూ.129కి బదులుగా రూ.179 చెల్లించాలి. ఇది రూ.50 పెరిగింది. చివరగా నెలవారీ ప్లాన్ త్వరలో రూ. 459 అధిక శ్రేణిలో అందుబాటులో ఉంటుంది. ధరల పెంపు అమలు చేయనంత వరకు వినియోగదారులు రూ.329ల తక్కువ ధరతో ప్లాన్‌ ను పొందవచ్చు.
సవరించిన ప్లాన్లన్నీ డిసెంబర్ 13 నుంచి...
ఈ మూడు సవరించిన ప్లాన్‌లు డిసెంబర్ 13 నుండి వర్తిస్తాయి. ఇప్పటికే అధికారిక వెబ్‌ సైట్‌లో ఈ విషయాన్నీ స్పష్టం చేశారు. ప్రస్తుతం 18 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు గల సభ్యులకు అందుబాటులో ఉన్న ఈ ప్లాన్ ఇప్పుడు సంవత్సరానికి రూ.749కి బదులుగా రూ.499కి అందుబాటులో ఉంటుంది. అదే విధంగా రూ.89, రూ.299కి బదులుగా, నెలవారీ ప్లాన్‌లు వరుసగా రూ.64, రూ.164లకు అందుబాటులో ఉంటాయి.
ప్రస్తుత సభ్యత్వం
ప్రస్తుత సభ్యత్వం మార్చబోరని సబ్‌స్క్రైబర్‌లు గమనించాలి. అయితే ప్లాన్ చెల్లుబాటు ముగిసిన తర్వాత వినియోగదారులు కొత్త ధరను చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల డిసెంబర్ 13 నుండి సవరించిన ప్లాన్‌లు అమలు చేయడానికి ముందే కొత్త ప్రైమ్ ప్లాన్‌ను ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ రివిజన్ గురించి వ్యాఖ్యానిస్తూ అమెజాన్ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఇలా పేర్కొంది “ఇప్పటికే ఉన్న ప్రైమ్ మెంబర్‌లు తమ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ప్రస్తుత ధరలో ఉన్న కాలానికి తమ సబ్‌స్క్రిప్షన్‌ను కొనసాగించవచ్చు. అయితే, ధరలలో మార్పు తర్వాత మీరు కొత్త ధరకు మీ సభ్యత్వాన్ని పునరుద్ధరించడాన్ని ఎంచుకోవచ్చు' అని.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: