బుల్లిపిట్ట: Xiaomi నుండి అదరగొట్టే సౌండ్ బార్ విడుదల..!
షియోమి సంస్థ నుండి విడుదలైన షియోమి సౌండ్ బార్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సౌండ్ బార్ కూడా వైర్లెస్ కనెక్టివిటీ తో పాటు సబ్ వూఫర్ ను మొదటిసారిగా అందించనుంది. ఈ సౌండ్ బార్ అవుట్ పుట్ విషయానికి వస్తే..430w సౌండు ను మనకు పంపిస్తుంది. అయితే వూఫర్, బార్ యొక్క కెపాసిటీ లు, సపరేట్ గా ఎంత కెపాసిటీ ఉంటుందో వాటి వివరణ తెలియజేయడం లేదు.
ఇందులో 3 పవర్ ఫుల్ స్పీకర్ లతోపాటు, మూడు సరికొత్త ట్విట్టర్లు కలిగియుండును మరియు వీటితోపాటు ఒక హెవీ బేస్ కోసం..6.5 ఇంచుల సబ్ వూఫర్ ను మనకి అందిస్తోంది. ఉఫర్ కోసం వైర్లెస్ సదుపాయాన్ని అందిస్తోంది. ఇందులో మనం మూడ్ ను బట్టి చేంజ్ చేసుకొనే సదుపాయాన్ని కూడా మనకు అందిస్తుంది. ముఖ్యంగా ఈ సౌండ్ బార్ లో సినిమా థియేటర్ లో చూసిన ఫీలింగ్ కలుగుతుందట.
ఇది సరికొత్త టెక్నాలజీని.. కనిపెట్టడం తో పాటు, చాలా శక్తివంతమైన దానిగా తయారుచేయబడిందట. ఇందులో ముఖ్యంగా డాల్బీ ఆడియో, డీ టీ ఎస్ తో సరికొత్త టెక్నాలజీతో షియోమి సంస్థ మనకు అందిస్తోంది. ఇక మార్కెట్లోకి ఈ బ్రాండెడ్ గల సౌండ్ బార్ ని ఎప్పుడు విడుదల చేస్తారనే విషయం తెలిపడం లేదు. అయితే ధర విషయానికి వస్తే 10,000 రూపాయలు ఉంటుంది ఉన్నట్లుగా అంచనా.