బుల్లిపిట్ట: ఇంట్లో నుండే.. ఆధార్ రేషన్ లింక్ ఇలా చేసుకోండి..?

Divya
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం"వన్ నేషన్ వన్ రేషన్" అనే పథకాన్ని తీసుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ పథకం తో ఎన్నో ప్రయోజనాలు ప్రజలకు అందుతున్నాయి. అయితే తే ఈ మధ్యకాలంలో రేషన్ కార్డుల పైనా ప్రభుత్వాలు కొన్ని ఆంక్షలు విధించడం జరుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఆధార్-రేషన్ లింక్ చేసుకోవడం చాలా అవసరం అన్నట్లుగా తెలియజేసింది. ఇంకా ఎవరైనా చేసుకోని వారు ఉంటే.. ఈ పద్ధతుల ద్వారా చేసుకోవచ్చు.

1). ఆన్ లైన్ ద్వారా రేషన్ కార్డుకు ఆధార్ నెంబర్ ఎలా లింక్ చేయాలంటే..!

మొదటగా ఆధార్ అధికారిక వెబ్ సైట్ అయిన uidai.gov.in ఓపెన్ చేయాలి.. ఇక అక్కడే వెబ్ పేజీలో స్టార్ట్ ను అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఒక కొత్త పేజీ మీకు ఓపెన్ అవుతుంది.. అడ్రస్ రాష్ట్రం ఫోన్ నెంబర్ వంటి తదితర వివరాలను మనం నమోదు చేయాల్సి ఉంటుంది.. ఆ తర్వాత రేషన్ కార్డు బెనిఫిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి, ఆ తర్వాత ఆధార్ కార్డు నెంబర్ రేషన్ కార్డు నెంబర్ మొబైల్ నెంబర్ ఇమెయిల్ అడ్రస్ వంటి వివరాలను నమోదు చేయాలి. ఈ పాట తరువాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఒక ఓటిపి వస్తుంది దీనిని వెబ్ పేజీలో ఎంటర్ చేస్తే మీ ప్రక్రియ పూర్తయినట్లు మీ మొబైల్ నెంబర్ కు ఒక్క మెసేజ్ కూడా వస్తుంది.. తర్వాత ఆధార్ ధ్రువీకరణ పూర్తయి రేషన్ కార్డు తో అనుసంధానం అవుతుంది.

2. ఆఫ్ లైన్ ద్వారా ఆధార్ నంబర్ ను  రేషన్ నెంబర్ కు ఎలా లింక్ చేయాలంటే..!

ముందుగా మీకు దగ్గరలో ఉన్న రేషన్ కేంద్రానికి వెళ్లి రేషన్ కార్డు ఆధార్ కార్డు జిరాక్స్ కాఫీలతో పాటు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ని తీసుకెళ్లి డీలర్కు ఇవ్వాల్సి ఉంటుంది.. ఇక తరువాత రేషన్ కార్డు కేంద్రంలో ఆధార్ డేటా బయోమెట్రిక్ వెరిఫికేషన్ కూడా మీరు చేయవచ్చు.. ఇక దీనితో సంబంధించిన అన్ని వివరాలను పరిశీలించి అధికారులు. ఆధార్ నంబర్ను రేషన్ నెంబర్ కు అనుసంధానం చేస్తారు ఆ తర్వాత మీకు ఒక మెసేజ్ కూడా వస్తుంది.

3. ఎస్ఎంఎస్ ద్వారా కూడా మీరు రేషన్ కార్డును ఆధార్ నంబర్ కు లింక్ చేయవచ్చు.. ఇందుకోసం మీరు UID D అని టైప్ చేసి రాష్ట్రం యొక్క పేరును రెండక్షరాల లో.. అంటే ఆంధ్రప్రదేశ్ అయితే ap అని, టైప్ చేసి మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి..51969 అనే నెంబర్ కు SMS పంపించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: