ఫేస్ బుక్ పేరు మార్పున‌కు చ‌ర్చ‌లు ?

గ‌త కొంత కాలంగా ఫేస్ బుక్ పై చాలా చ‌ర్చ న‌డుస్తోంది. ముఖ్యం గా కొన్ని రోజుల క్రితం ఫేస్ బుక్ సేవ‌ల‌కు దాదాపు 8 గంట‌ల పాటు అంత‌రాయం ఏర్పాడ్డ నాటి నుంచి ఫేస్ బుక్ చాలా పుకార్లు వ‌చ్చాయి. అదే ఫేస్ బుక్ వ్య‌వ‌స్థ‌ప‌కుడు మ‌రియు సీఈవో మార్క్ జుక‌న్ బ‌ర్గ్ త‌న ప‌ద‌వి రాజీనామా చేస్తాడ‌ని అనేక వ‌ర్తలు వ‌చ్చాయి. ఈ నెల చివ‌రి వ‌ర‌కు మార్క్ జుక‌న్ బ‌ర్గ్ త‌న ప‌ద‌వి కి స్వ‌చ్ఛందంగా రాజీనామ చేయ‌బోతున్నార‌ని అన్నారు. అయితే ఈ పుకార్ల పై ఫేస్ బుక్ యాజమాన్యం కూడా స్పందించింది. మార్క్ జుక‌న్ బ‌ర్గ్ త‌న ప‌ద‌వి రాజీనామా చేయడం లేద‌ని ప్ర‌క‌టించింది. ఆ వార్త లు అన్ని కూడా పుకార్లే అని స్ప‌ష్టం చేసింది. తాను చివ‌రి వ‌ర‌కు ఫేస్ బుక్ తో క‌లిసే ఉంటార‌ని తెలిపింది.

అయితే తాజాగా మరొక స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చిన ట్టు తెలుస్తోంది. ఈ స‌మాచారం ప్ర‌కారం ఫేస్ బుక్ పేరు త్వ‌ర‌లో మార‌బోతుంద‌ని తెలుస్తోంది. దీనికి సంబంధించి మార్క్ జుక‌న్ బ‌ర్గ్  ఆ సంస్థ లో ఉన్న ఉన్న‌త ఉద్యోగు ల‌తో   కూడా చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. అయితే ఈ నెల 28 న ఫేస్ బుక్ కు సంబంధించిన ఒక ముఖ్య మైన స‌మావేశం జ‌రుగ‌బోతుంది. ఈ స‌మావేశం లో నే మార్క్ జుక‌న్ బ‌ర్గ్ ఫేస్ బుక్ కు  కొత్త పేరు యాజ‌మాన్యానికి సూచించ బోతున్నాడ‌ని స‌మాచారం. అయితే ఈ విష‌యం పై యాజ‌మాన్ని సంప్ర‌దిస్తే దీని పై వారు స్పంధించ లేదు. దీంతో త్వ‌ర‌లో నే ఫేస్ బుక్ కు కొత్త పేరు రాబోతుంద‌ని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఉన్న ఫేస్ బుక్ పై అనేక విమ‌ర్శ‌లు ఉన్నాయి. న‌కిలి వార్తలు క‌ట్ట‌డి చేయ‌డంలో ఫేస్ బుక్ విఫ‌ల‌మైంద‌ని చాలా మంది వాద‌న. అలాగే సెక్యురీటి పైన కూడా చాలా వ‌ర‌కు విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ అంశాల పై తోనే అమెరికా కాంగ్రెస్ ఫేస్ బుక్ పై ఆగ్ర‌హాం వ్య‌క్తం చేసింది. అలాగే ఫేస్ బుక్ పై కూడా అమెరికా కాంగ్రెస్ ప‌లు ఆంక్షాలు విధించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: