ఎయిర్ బోర్న్.. డ్రోన్లతో ఔషదాలు.. !

తెలంగాణాలో వైద్య ఆరోగ్య శాఖ కొత్తశకానికి నాంది పలికింది. మారుమూల ప్రాంతాలకు లేదా వరదలు వంటివి సంభవించి ఆయా ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితులలోను అక్కడ ఉన్న ప్రజల కు వైద్య సేవలు అందించే దిశగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే డ్రోన్ లతో ఔషధాలను పంపిణి చేయడం ప్రారంభించింది. ప్రారంభంలో ఈ డ్రోన్ లతో కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలకు ఈ ఔషధ సరఫరా చేశారు. ఇప్పుడు కొత్త సాంకేతికత అందిపుచ్చుకొని, ఎయిర్ బోర్న్ మెడికల్ ట్రాన్స్ పోర్ట్(ఏఎంఆర్టి25) అనే హైబ్రిడ్ డ్రోన్ లను ఇందుకోవం వాడుతున్నారు. వీటిని ఉపయోగించడం ద్వారా దాదాపు 33 నిముషాలలో 45 కిలోమీటర్లు ప్రయాణించి మరి ఆయా ప్రాంతాలకు ఔషధాలను పంపిణి చేయవచ్చు.
మొదట డ్రోన్ ల ద్వారా 500 మీటర్ల వరకు ఈ ఔషధ పంపిణి ప్రయోగాత్మకంగా జరిగినప్పటికీ అది మంచి ఫలితాలను ఇస్తుండటం తో పరిధిని 2-5 కిలోమీటర్ల వరకు పెంచారు. అనంతరం ఈ పరిధి పెంచుకుంటూ పోతూ 20-25-30 కిలోమీటర్ల వరకు ఈ సేవలు అందుబాటులోకి తెచ్చారు. అయితే ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వ రంగ సంస్థ టివర్క్స్ రూపొందించిన నూతన సాంకేతికతతో ఈ పరిధి తక్కువ సమయంలోనే 45 కిలోమీటర్ లు చేరుకునేట్టుగా తీర్చిదిద్దారు. ఇప్పటికే గత డ్రోన్ లతో అనేక మందికి సేవలు అందించారు. ఈ తాజా సాంకేతికత తో సేవలు అందించాల్సి ఉంది.
ఈ నూతన సాంకేతికతను నేటి నుండి అమలు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే ఈ పరిధిని పెంచుకుంటూ పోతూ ఈ నెలాఖరులోగా 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి మరి ఔషధ పంపిణి చేసే  పెట్టుకున్నట్టు వారు తెలిపారు. 3.5 కిలోల బరువును మోసే విధంగా రాబోయే సాంకేతికత ఉండనుందని వారు తెలిపారు. నేటి నుండి వాడుతున్న డ్రోన్ 25 కిలోమీటర్ల తరువాత రీఛార్జ్ లేదా బ్యాటరీ మార్చడం ద్వారా దాని పరిధిని మారుస్తున్నట్టు వారు తెలిపారు. అయితే రాబోయే సాంకేతికతతో ఈ లోపం ఉండబోదని, సరాసరి 100 కిలోమీటర్లు ప్రయాణించగలిగే డ్రోన్ లను తయారు చేస్తున్నట్టు వారు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: