ఫోన్ మాల్వేర్ బారిన పడిందా ? అయితే ఇలా చేయండి

Vimalatha
కంప్యూటర్ వైరస్ అనేది ఒక సాధారణ సంఘటన. కానీ ఇది ఫోన్‌కు చాలా పెద్ద సమస్య. మీ ఫోన్ లో విలువైన డేటాను దొంగిలించడానికి, డార్క్ వెబ్‌లో దాన్ని అమ్మేసి ఆదాయాన్ని సంపాదించడానికి కోడర్లు హానికరమైన సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగిస్తారు. దీంతో ఫోన్ అంతర్గత, బాహ్య నష్టానికి గురవుతుంది. అంతర్గత నష్టం సాధారణంగా యాప్‌లు, యాడ్స్ మొదలైన వాటి రూపంలో వస్తుంది. అయితే మీ ఫోన్‌లో వైరస్ ఉందో లేదో మీకు ఎలా తెలుస్తుంది? మీ ఫోన్‌లో మాల్వేర్ ఉందో లేదో తెలుసుకోవడానికి కొన్ని ముఖ్యమైన సంకేతాలు ఇక్కడ ఉన్నాయి.
మీ ఫోన్‌లో మాల్వేర్ ఉందని చెప్పే సిగ్నల్స్ ఇవే
డేటా వినియోగం ఫాస్ట్ అవ్వడం. ఎందుకంటే వైరస్ చాలా బ్యాక్‌గ్రౌండ్ టాస్క్‌లను అమలు చేయడానికి, ఇంటర్నెట్‌తో 'కమ్యూనికేట్' చేయడానికి ప్రయత్నిస్తుంది.
హానికరమైన యాప్‌లు పని చేస్తూనే ఉంటాయి. కాబట్టి బ్యాటరీ వేగంగా అయిపోతుంది.
అనుమానాస్పద పాప్-అప్ ప్రకటనలు వైరస్ కు మరొక సంకేతం. అనేక సైట్‌లు పాప్-అప్ ప్రకటనలను కలిగి ఉన్నప్పటికీ ఫోన్ లో ఎక్కువగా కనిపించే యాడ్స్ సరైనది కాదు.
యాప్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేయని హోమ్ స్క్రీన్‌లో కొత్త యాప్‌లు వింతగా కనిపిస్తాయి. ఈ కొత్త యాప్‌లలో మాల్వేర్ ఉండవచ్చు.
పని తీరు తగ్గిపోవడం అనేది మీ పరికరం మాల్వేర్‌కు గురయ్యే మరొక సంకేతం.
మీ ఫోన్ కు వైరస్ సోకినప్పుడు ఇలా చేయండి  
మీ ఫోన్‌లో ఈ సంకేతాలు ఏవైనా ఉంటే దాన్ని పరిష్కరించడానికి ఇలా ట్రై చేయండి
ఇటీవల ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లను చెక్ చేయండి తక్కువ డౌన్‌లోడ్, బ్యాడ్ రివ్యూ ఉన్న ఏదైనా యాప్ మీకు కనిపిస్తే, ఆ యాప్‌ను డిలీట్ చేయండి.
కొన్ని మాల్వేర్‌లు మీ బ్రౌజర్‌లో కూడా దాగొచ్చు. ఆ సందర్భంలో మీరు మీ ఫోన్ సెట్టింగ్‌లలోని chache ను క్లియర్ చేయాలి.
మీ పరికరంలో ఏదైనా హానికరమైన యాప్‌ల కోసం స్కాన్ చేసే టాప్ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయడం మరొక పద్ధతి.
ఈ పరిష్కారాలు ఏవీ బ్యాటరీ/డేటా డ్రైని తగ్గించడానికి లేదా పనితీరును మెరుగుపరచడంలో సహాయపడకపోతే చివరి పద్ధతి ఫ్యాక్టరీ రీసెట్ కోసం వెళ్లడం. అయితే మీరు ప్రక్రియను ప్రారంభించడానికి ముందు మీ ముఖ్యమైన ఫైల్స్ అన్నీ సేవ్ చేశారా అనేది నిర్ధారించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: