7 గంటలసేపు అందరికీ పిచ్చెక్కిపోయింది... అసలేమైంది..?
అసలేమైంది..?
ఫేస్ బుక్ నిర్వాహకులు.. సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. టెక్నికల్ రీజన్ అంటూ సర్దిచెప్పేశారు, ఇప్పటి వరకూ తమకు తోడుగా ఉన్న, తమకు మద్దతిచ్చిన వినియోగదారులకు ధన్యవాదాలు అంటూ ట్విట్టర్ లో పోస్టింగ్ పెట్టి సైలెంట్ అయ్యారు. మన దేశంలో దాదాపు 41కోట్లమంది ఫేస్ బుక్ యూజర్లు ఉన్నారని అంచనా, వాట్సప్ ని 53కోట్లమంది వాడుతుండగా, ఇన్ స్టా కు 21 కోట్లమంది ఖాతాదారులున్నారు. సర్వర్లు డౌన్ అవడం, అసలు సేవలు పూర్తిగా ఆగిపోవడంతో వీరిలో చాలామంది ఇబ్బంది పడ్డారు.
దాదాపు ఏడుగంటలు.. ఎందుకిలా..?
గతంలో 10 నిముషాలు, లేదా 20 నిముషాలు మహా అయితే అరగంట.. వాట్సప్ సర్వర్ డౌన్ అయ్యేది. కానీ ఇప్పుడు ఏకంగా 7గంటలసేపు మొత్తం వాట్సప్, ఫేస్ బుక్, ఇన్ స్టా డౌన్ అయ్యే సరికి అందరికీ పిచ్చెక్కినట్టైంది. ఈ టైమ్ లో అందర్నీ ట్విట్టర్ ఆదుకుంది. అందరూ ట్విట్టర్ లోకి వచ్చి టైమ్ పాస్ చేశారు. చాలామంది చాటింగ్ కోసం టెలిగ్రామ్ లోకి వచ్చేశారు. అయితే అందరికీ ఒక విషయం మాత్రం అర్థమైంది. ఫేస్ బుక్, వాట్సప్, ఇన్ స్టా లేకుండా గంటలసేపు ఉండాల్సి వస్తే ఏంచేయాలనే విషయంపై ఓ క్లారిటీ వచ్చేసింది.
ట్విట్టర్ లో మీమ్స్ మోత మోగిపోయింది..
గతంలో ఫేస్ బుక్ డౌన్ అయినా, వాట్సప్ డౌన్ అయినా వెంటనే ట్విట్టర్ లో మీమ్స్ వచ్చేవి. ఈసారి అవి ఓ రేంజ్ లో ఉన్నాయి. సోషల్ మీడియాలో ట్విట్టర్ లో మీమ్స్ మోత మోగిపోయింది. ఈ దెబ్బతో ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య పెరిగే అవకాశముందని కూడా అంచనాలున్నాయి. అయితే వాట్సప్ లాంటి ఫ్రెండ్లీ యూజర్ ఇంటర్ ఫేస్ ఇంతసేపు ఆగిపోతుందని ఎవరూ ఊహించలేదు.